Budget Session 2026 Parliament LIVE: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (ఫిబ్రవరి 1, 2026) తొమ్మిదోసారి బడ్జెట్-2026-27 ప్రవేశపెట్టనున్నారు. వికసిత్ భారత్ థీమ్‌గా బడ్జెట్ ఉండనుంది. బడ్జెట్‌లో ఏయే రంగాలపై ఫోకస్ ఉంటుంది. వేటికి పెద్దపీట వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి ద్రవ్య లోటుకు కళ్లెం వేయడంతో పాటు..క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను గణనీయంగా పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. రైల్వే, రహదారులు, డిఫెన్స్, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌లో మౌలిక సదుపాయల కోసం భారీగా పెట్టుబడులు పెట్టనున్నారని సమాచారం. తెలుగు రాష్ట్రాలు ఆకాంక్షలు, సామాన్యుడి ఆశలు.. వీటన్నింటి దృష్టిలో ఉంచుకుని కేంద్రంలోని మోదీ సర్కార్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది..
పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి నిర్మల
— 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నిర్మలాసీతారామన్
— ఉదయం 8:30కి కర్తవ్యభవన్‌కు నిర్మలాసీతారామన్
— ఉదయం 9:30కి రాష్ట్రపతి ముర్మును కలవనున్న నిర్మల
— ఉదయం 10 గంటలకు పార్లమెంట్‌కు నిర్మలా సీతారామన్
— ఉదయం 10:15కి మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం
— బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్
— ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్
— సుమారు 2గంటలపాటు బడ్జెట్ ప్రసంగం ఉండే అవకాశం
— మధ్యాహ్నం 2:30కి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం