BSNL Jobs 2026: డిగ్రీ అర్హతతో ప్రభుత్వ టెలికాం సంస్థ BSNLలో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.50 వేల జీతం

BSNL Jobs 2026: డిగ్రీ అర్హతతో ప్రభుత్వ టెలికాం సంస్థ BSNLలో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.50 వేల జీతం


భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్ఎన్‌ఎల్‌).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 120 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ (టెలికమ్‌) పోస్టులు 95, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ (ఫైనాన్స్‌) పోస్టులు 25 వరకు ఉన్నాయి. టెలికమ్, ఫైనాన్స్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తుది గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

టెలికమ్, ఫైనాన్స్ విభాగాల్లోని ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్‌ లేదా సీఏ/ సీఎంఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి మార్చి 7, 2026వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎబీసీ అభ్యర్ధులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు గరిష్టంగా 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 7, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.1250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 24,900 నుంచి రూ. 50,500 వరకు జీతంగా చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 7, 2026వ తేదీ రాత్రి 10 గంటల వరకు
  • దరఖాస్తు సవరణ తేదీలు: మార్చి 8 నుంచి మార్చి 15వ తేదీ రాత్రి 10 గంటల వరకు
  • ఆన్‌లైన్‌ రాత పరీక్ష తేదీ: మార్చి 29, 2026వ తేదీ

బీఎస్ఎన్‌ఎల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *