Bomb Threat: ఆ టైంకు పేల్చేస్తాం.. తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు

Bomb Threat: ఆ టైంకు పేల్చేస్తాం.. తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు


ఇటీవల దేశంలో బాంబు బెదిరింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఏకంగా పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు అధికారిక వెబ్‌సైట్లకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్స్‌ పెట్డడం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఏపీ, తెలంగాణలోని పలు కోర్టులకు ఒకేసారి బెదిరింపులు రావడంతో అధికారిక వర్గాల్లో కల్లోలం రేగింది. ప్రధానంగా హైదరాబాద్‌ నాంపల్లి కోర్టులో మధ్యాహ్నం 12గంటల 5నిమిషాలకు బాంబు పేలుతుందని ఈ-మెయిల్‌ రావడం భయాందోళనకు గురి చేసింది. కోర్టు ప్రాంగణంలోని న్యాయవాదులు, సిబ్బంది ఉరుకులు, పరుగులు తీశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాంబు స్క్వాడ్స్‌, డాగ్ స్క్వాడ్స్‌తో ముమ్మరంగా తనిఖీలు చేశారు. నాంపల్లి కోర్టులో ఎక్కడా బాంబు ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

అటు.. కరీంనగర్‌, రాజమండ్రి, అనంతపురం జిల్లా ధర్మవరం కోర్టులకు కూడా బాంబు బెదిరింపు కాల్స్‌ రావడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. న్యాయవాదులు, సిబ్బందిని కోర్టు ప్రాంగణాల నుంచి బయటకు పంపి.. కోర్టుల్లో తనిఖీలు చేశారు. ఎలాంటి బాంబులు లేవని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇవన్ని ఫేక్ బెదిరింపు కాల్స్‌గా గుర్తించారు. అయితే.. ఫోన్‌కాల్స్‌, ఈ-మెయిల్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదేదో ఆకతాయిల పనిగా భావిస్తున్నారు. ఇక.. గతంలోనూ దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే తరహా బాంబు బెదిరింపులు వచ్చాయి. స్కూల్స్‌, కాలేజెస్‌, కోర్టుల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు షాకిచ్చాయి. కానీ.. ఆయా సమయాల్లోనూ అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు.. తనిఖీలు నిర్వహించి.. ఫేక్ కాల్స్‌, ఫేక్‌ ఈ-మెయిల్స్‌గా తేల్చి ఆకతాయిలను అరెస్ట్‌లు చేశారు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *