‘ నాలో ఫైర్ ఇప్పుడే స్టార్టయ్యింది. పైకి మాత్రమే సౌమ్యుణ్ని.. లోపల ఫైర్ ఉంటుంది. ఈటలతో అన్ని విషయాలూ చర్చించాను. కొన్ని విభేదాలున్నా అందరూ కలిసినడిచేందుకు సిద్దంగానే ఉన్నాం. కరీంనగర్‌లో విభేదాలే తప్ప, వర్గపోరు కనిపించలేదు. మా పార్టీ సోషల్ మీడియా ఎవ్వరిపైనా దుష్ప్రచారం చేయదు. బయటి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఈటల రాజేందర్‌పై ఎక్కడా వ్యతిరేక పోస్టులు రాలేదు. అభ్యంతరకర పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం. పార్టీలో విభేదాలున్నా, నాతో వ్యక్తిగత ఇబ్బందులు ఎవరికీలేవు’ అని క్రాస్ ఫైర్‌లో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు.
ఇది చదవండి: మూసీ నది వెంబడి ఆగని చప్పుళ్లు.. ఏంటని కెమెరాకు పని చెప్పగా..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి