కాంగ్రెస్‌పై పోరాటం చేయడంలో బీజేపీ వెనకడుగు వేస్తుందా?.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందా?.. బనకచర్లపై బీజేపీ ఎందుకు సైలెంట్‌గా ఉంటుంది?.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం టాక్స్‌పై బీజేపీ స్టాండ్ ఏంటి?.. అసలు బీఆర్ఎస్ విలీన ప్రతిపాదనలు తెరపైకి తెచ్చిందెవరు?… అటు.. ఏపీ పొత్తు ఫార్ములా తెలంగాణలోనూ రిపీట్ కాబోతోందా?.. తెలంగాణ పాలిటిక్స్‌లో కాక రేపుతోన్న ఈ ఇంట్రస్టింగ్ టాపిక్స్‌పై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు హాట్ కామెంట్స్ చేశారు. టీవీ9 క్రాస్ ఫైర్‌లో ఫైర్ స్టార్లా మారిపోయారు. ఆయా అంశాలపై రాంచందర్‌రావు రియాక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రచారాలన్నీ థర్డ్ పార్టీ ముచ్చట్లే అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఇంట్లో ముచ్చట్లను విలీనాలుగా ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తోనూ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు రామచంద్రరావు. అప్పుడైనా.. ఇప్పుడైనా ప్రజా సమస్యలపై బీజేపీనే పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. మతం పేరిట రిజర్వేషన్లను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు రామచంద్రరావు. ముస్లింలకు బీసీ-E కోటాలో రిజర్వేషన్లు ఉండగా మళ్లీ బీసీ రిజర్వేషన్లలో ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. 42శాతం రిజర్వేషన్లలో ముస్లింలను మినహాయిస్తే, కాంగ్రెస్ తెస్తున్న బీసీ రిజర్వేషన్లకు బీజేపీ సపోర్టు చేస్తుందన్నారు. ఏ పార్టీలోనైనా విభేదాలు సహజం అన్నారు రామచంద్రరావు. ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో ఈటల రాజేందర్‌ను స్వయంగా కలిసి అతనితో అన్ని విషయాలూ చర్చించానని.. అలాంటి పరిస్థితులన్నీ త్వరంలో సర్దుకుంటాయని తెలిపారు. బనకచర్ల అంశాన్ని బీజేపీపైకి నెట్టడం కరెక్ట్ కాదన్నారు రామచంద్రరావు. తెలంగాణకు నష్టం చేసే ఏ ప్రాజెక్ట్‌నూ బీజేపీ ఒప్పుకోదని స్పష్టం చేశారు.
ఇక.. ఏపీ పొత్తులు తెలంగాణలో బీజేపీకి ఉండవన్నారు రామచంద్రరావు. అలాగే.. తెలంగాణలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగానే పోరాడుతుందని తెలిపారు. మొత్తంగా.. తెలంగాణ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న పొత్తులు, విలీనాలపై టీవీ9 క్రాస్ ఫైర్ వేదికగా కీలక విషయాలు వెల్లడించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్‌తో నో కాంప్రమైజ్, బీఆర్ఎస్ విలీనం టాక్స్.. థర్డ్ పార్టీ ముచ్చట్లేనని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి: మూసీ నది వెంబడి ఆగని చప్పుళ్లు.. ఏంటని కెమెరాకు పని చెప్పగా..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి