Bigg Boss 9 Telugu : ఇది కదా కావాల్సింది.. బిగ్‏బాస్ 9లోకి ఆ క్రేజీ సింగర్.. ఇక రచ్చ రచ్చే..

Bigg Boss 9 Telugu : ఇది కదా కావాల్సింది.. బిగ్‏బాస్ 9లోకి ఆ క్రేజీ సింగర్.. ఇక రచ్చ రచ్చే..


బిగ్‏బాస్ రియాల్టీ షో.. బుల్లితెరపై అతిపెద్ద షో. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంటుంది. ఇప్పటివరకు అన్ని భాషలలో వరుస సీజన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు త్వరలోనే సీజన్ 9 స్టార్ట్ కాబోతుంది. దీంతో ఈ షో గురించి నిత్యం ఏదోక వార్త నెట్టింట వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి అనేకమంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఓవైపు బిగ్‏బాస్ నిర్వాహకులు వరుస ప్రోమోస్ షేర్ చేస్తుండగా.. రోజుకో కంటెస్టెంట్ పేరు నెట్టింట చక్కర్లు కొడుతుంది. సినీతారలు, సీరియల్ సెలబ్రేటీలతోపాటు ఈసారి సైతం కామన్ కేటగిరిలోనూ ఎంపిక చేయనున్నారట. అందులో భాగంగా ఆగస్ట్ రెండో వారంలో ఫైనల్ ఎంపిక జరుగుతుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి.. OTT Movie: బాబోయ్.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న థ్రిల్లర్ సినిమాలు.. ఊహకు అందని ట్విస్టులు..

ఇదిలా ఉంటే..బిగ్‏బాస్ సీజన్ 9 కోసం కంటెస్టెంట్స్ ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ క్రేజీ సింగర్ పేరు తెరపైకి వచ్చింది. సింగర్ శ్రీతేజ పేరు వినిపిస్తుంది. ఇప్పటివరకు అనేక సినిమాల్లో మంచి రొమాంటిక్ మెలోడి సాంగ్స్ తో ఫేమస్ అయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సింగింగ్ విభాగం నుంచి ప్రతి సీజన్ కు ఒకరిని ఎంపిక చేస్తుంటారు. ఇక ఇప్పుడు సింగర్ శ్రీతేజను పైనల్ చేశారట.

ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

Bigg Boss 9 Telugu

Bigg Boss 9 Telugu

అలాగే సీరియల్ బ్యూటీ కావ్య శ్రీ సైతం ఈసారి సీజన్ 9లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. కొన్ని రోజుల వరకు చిన్ని సీరియల్ ద్వారా అలరించింది కావ్య. అలాగే అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య కంచర్ల, కల్పిక గణేష్, దీపికా దేబ్జానీ, ఇమ్మాన్యుయేల్, సాయి కిరణ్ పేర్లు వినిపిస్తున్నాయి.

Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‏లో అందాల రచ్చ..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *