Bhishma Ekadashi: భీష్మ ఏకాదశి.. ఈరోజు ఆ ఒక్కటీ చేస్తే అదృష్టం, రాజయోగం మీదే!

Bhishma Ekadashi: భీష్మ ఏకాదశి.. ఈరోజు ఆ ఒక్కటీ చేస్తే అదృష్టం, రాజయోగం మీదే!


హిందూ మతంలో భీష్మ ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రతి నెల శుక్ల పక్షం, కృష్ణ పక్షం ఏకాదశి రోజున విష్ణువుని పూచించడం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే, మాఘ మాసంలో శుక్ల పక్షం ఏకాధి రోజున భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి జరుపుకుంటారు. ఈ రోజు మహా విష్ణువును ప్రత్యేకంగా పూచించడంతోపాటు భీష్ముని స్మరించుకుంటారు. భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి ఈ రోజున అంటే జనవరి 29న బుధవారం నాడు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈరోజున చాలా మంది ఉపవాసం ఉంటారు. మహా భారతంలో భీష్మ పితామహుడు గురించి చాలా మందికి తెలుసు. ఆయనకు ఒక ప్రత్యేకమైన వరం ఉంది. అది ఆయన కోరుకున్నప్పుడే ఆయనకు మరణం సంభవిస్తుంది.

అంతేగాక, భీష్మ పితామహుడు విష్ణు సహస్ర నామాలను, రాజనీతి ధర్మాలను, కాల నియమం లేని ధర్మ సూక్ష్మాలను తెలియజేశారు. తన తప్పిదాలకు తానే అంపశయ్యను శిక్షగా విధించుకున్నాడు. బీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలను పారాయణ చేయడంతో శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రులవుతారు. మహాభారతంలో మహావీరుడు భీష్ముడు ఈ ఏకాదశి రోజునే శ్రీకృష్ణుని స్మరించుకుంటూ ప్రాణత్యాగం చేసినట్లు విశ్వాసం. అందుకే ఈ రోజును భీష్ముని పేరుతో భీష్మ ఏకాదశిగా పిలుస్తారు.

ఈ ఒక్కటి చేస్తే చాలు.. అదృష్టం, రాజయోగం

విష్ణు సహస్రనామ పారాయణంతో కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ఇంట్లో ప్రతికూలతలు తొలిగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ రోజు విష్ణు నామ పారాయణంతో జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. అదృష్టంతోపాటు రాజయోగం కలుగుతుంది. విష్ణు పారాయణంతో మానసిక సమస్యలు తగ్గి వారి మనస్సు దృఢమవుతుంది. మానసిక, శరీరక సమస్యలు తగ్గి సుఖజీవనం ప్రాప్తిస్తుంది.

విష్ణు పారాయణంతో భీష్మ ఏకాదశి రోజునే కాకుండా నిత్యం పారాయణ చేసే వారికి రక్షణ కవచంగా సుదర్శన శక్తి లభిస్తుంది. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి. నవగ్రహ దోషాలు కూడా తొలగిపోయి వాక్షుద్ధి కలుగుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది.

భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా కనీసం “ఓం నమో నారాయణాయ” మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించడం చాలంటున్నారు పండితులు. ఉపవాసం చేయలేని వారు మనసుతో ఉపవాస భావనతో ఈ జపం చేస్తే కూడా పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి.

భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత

శాస్త్రాల ప్రకారం, ఈ ఏకాదశి నాడు చేసే వ్రతం వెయ్యి ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. ముఖ్యంగా పితృదేవతల ఆశీర్వాదం పొందేందుకు ఈ రోజు అత్యంత అనుకూలమైనదిగా చెప్పబడింది. పితృదోషాలు, కర్మబంధనాలు తగ్గుతాయని భక్తులు విశ్వసిస్తారు.

ఏకాదశి వ్రత విధానం

ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. శ్రీ మహావిష్ణువుకు తులసి, పుష్పాలతో పూజ చేయాలి. ఏకాదశి వ్రత కథ వినడం లేదా చదవడం.

ఉపవాసం ఉండటం. బియ్యంకు సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం. సామర్థ్యం మేరకు అన్నదానం లేదా దానం చేయడం సకల శుభాలను కలిగిస్తాయి.

జీవితంలో కలిగే ఫలితాలు

ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి మానసిక ప్రశాంతత, ఆర్థిక ఇబ్బందులు తగ్గడం, కుటుంబ కలహాలు శాంతించడం, పితృదేవతల కృప లభించడం, వంటి శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. భీష్మ ఏకాదశి రోజున చేసే ఈ ఒక్క ఆధ్యాత్మిక కార్యం ‘విష్ణు నామస్మరణ’.. జీవితంలో అద్భుతమైన మార్పులకు బాట వేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. భక్తి, నమ్మకం, నియమం ఉంటే చిన్న ప్రయత్నమే పెద్ద ఫలితాన్ని ఇస్తుందనడానికి ఇదే నిదర్శనం.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *