తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన అనేక అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క TV9 క్రాస్ ఫైర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కక్ష సాధింపు రాజకీయాల ఆరోపణల నుంచి పార్టీ అంతర్గత విషయాల వరకు… కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ నుంచి బీసీ రిజర్వేషన్ల వరకు.. ఇలా అనేక అంశాలపై టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ సంధించిన ప్రశ్నలకు భట్టి సమాధానం ఇచ్చారు. మరి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై సర్కార్ వ్యూహం ఏంటి..? సీఎం కూర్చీలో కూర్చోవాలని భట్టి ఆశపడ్డారా? ఇవేకాదు చాలా అంశాలపై భట్టి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
రివేంజ్ పాలిటిక్స్ ఆరోపణలపై టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ సంధించిన ప్రశ్నలకు భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత రాజకీయాలకు తావులేదన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న కాళేశ్వరం అంశంపై భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్‌పై చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నకు టీవీ9 క్రాస్ ఫైర్‌లో క్లారిటీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నో రాష్ట్రాల్లో బీసీలను సీఎం చేసిందని… సమయంవచ్చినప్పుడు తెలంగాణలోనూ బీసీ సీఎంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందన్నారు భట్టి.
తాను సీఎం రేసులో ఉన్నానని చెప్పారు భట్టి విక్రమార్క. అందుకు అవసరమైన అర్హతలూ తనలో ఉన్నాయన్నారు. అయితే ప్రస్తుత బాధ్యతలతో సంతోషంగా ఉన్నాననని.. క్రాస్‌ఫైర్‌లో చెప్పుకొచ్చారు.
పార్టీ అంతర్గత విషయాలపై కూడా భట్టి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఎలాంటి గ్రూపులూ లేవు..అందరం కాంగ్రెస్ గ్రూపే అంటూ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలోనేకాదు, స్టేట్ పాలిటిక్స్‌ను తన వ్యాఖ్యలతో రచ్చరేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ ఆయనకు పదవిపై ఇచ్చిన హామీ నిజమేనంటూ.. టీవీ9 క్రాస్ ఫైర్‌లో అసలు విషయాన్ని బయటపెట్టారు.
ప్రజా ప్రభుత్వంగా చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో.. కమీషన్లు, ట్యాక్సుల గోలపై భట్టి తీవ్రంగా స్పందించారు. ఈ విషయమై ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలకు.. టీవీ9 క్రాస్ ఫైర్ వేదికగా బలమైన బదులే ఇచ్చారు. ప్రతీ చెల్లింపులోనూ నిజాయితీగా ముందుకెళ్తున్నామన్నారు భట్టి.
మొత్తంగా టీవీ9 క్రాస్ ఫైర్ పోగ్రామ్‌లో ఇటు పాలన, అటు రాజకీయలు, పార్టీ అంశాలపై టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ సందించిన ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు భట్టి.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..