పవర్, కంఫర్డ్ కోరుకునే వారికి రాయల్ ఎన్ ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ బాగా నప్పుతుంది. దీనిలోని 452 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి 39.4 బీహెచ్ పీ శక్తి, 40 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. అన్నిరకాల రోడ్లపై చక్కని ప్రయాణానికి అనువుగా ఉంటుంది. అడాప్టివ్ ఎర్గోనామిక్స్ తో జర్నీ చాలా సౌకర్యవంతంగా జరుగుతుంది. ఈ బైక్ రూ.2.39 లక్షలకు అందుబాటులో ఉంది.
కొత్త రైడర్లకు అనుకూలంగా ఉండే బైక్ లలో హోండా సీబీ 300 ఎఫ్ ఒకటి. ఆకట్టుకునే స్టైల్, మెరుగైన పనితీరు దీని ప్రత్యేకతలు. ఈ బైక్ లోని 293.52 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ నుంచి 24.1 బీహెచ్ పీ శక్తి, 25.6 ఎన్ ఎం టార్క్ విడుదల అవుతుంది. షార్ప్ ట్యాంక్ ఎక్స్ టెన్షన్లు, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, మస్క్యులర్ స్టాన్స్, స్పోర్టీ గ్రాఫిక్స్ తో అదరగొడుతోంది. సుమారు 153 కిలోల బరువైన ఈ బైక్ నగర వీధుల్లో రైడింగ్ కు బాగుంటుంది. దీని ధర రూ.1.70 లక్షలు.
యువతను ఆకట్టుకునే బైక్ లలో కేటీఎం 390 డ్యూక్ ముందుంటుంది. డిజైన్, లుక్, పనితీరు పరంగా సూపర్ అని చెప్పవచ్చు. ఎడ్జీ డిజైన్, ఎక్స్ పోజ్డ్ ట్రేలిస్ ఫ్రేమ్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ఆకట్టుకుంటున్నాయి. దీనిలోని 398.63 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజిన్ నుంచి 45.3 బీహెచ్ పీ శక్తి, 36 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. 168.3 కిలోల బరువున్న ఈ బైక్ ను రూ.2.96 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.
కొత్తగా బైక్ నడుపుతున్న వారితో పాటు అనుభవం ఉన్న రైడర్లకు కూడా కవాసకి నింజా 300పై ప్రయాణం ఉత్సాహాన్ని ఇస్తుంది. స్లైల్, స్పోర్టీ లుక్ తో పూర్తి ఫెయిర్డ్ డిజైన్ తో ఆకట్టుకుంటోంది. దీనిలో 296 సీసీ లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దాని నుంచి 38.8 బీహెచ్ పీ శక్తి, 26.1 ఎన్ ఎం టార్కు విడుదల అవుతుంది. రూ.179 కిలోల బరువైన ఈ బండిని ఇరుకు వీధుల్లో కూడా సులభంగా నడపొచ్చు. దీని ధర రూ.3.43 లక్షలు.
ఆధునిక టెక్నాలజీతో స్పోర్ట్స్ బైక్ కావాలని కోరుకునేవారికి సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 చాలా బాగుంటుంది. నగరంలో రైడింగ్ తో పాటు టూర్లకు కూడా చక్కగా వెళ్లిపోవచ్చు. దీనిలోని 249 సీసీ ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి 26 బీహెచ్ పీ శక్తి, 22.2 ఎన్ ఎం టార్కు విడుదల అవుతుంది. ఈ బైక్ బరువు 161 కిలోలు. మార్కెట్ లో రూ.2.07 లక్షలకు అందుబాటులో ఉంది.