అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, లిగ్నాన్స్, ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అవిసె గింజలు తినడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. అవిసె గింజలతో తయారు చేసిన టీ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ వేగంగా కరుగుతుంది. ప్లాక్స్ సీడ్స్, దాల్చిన చెక్క, తేనెతో ఈ టీ తయారు చేస్తారు. ఉదయాన్నే మేల్కొన్న వెంటనే అవిసె గింజల నీటిని తాగండి. వారానికి రెండు లేదా మూడు సార్లు అవిసె గింజల నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అవిసె గింజలను వివిధ రకాల స్మూతీల్లో యాడ్ చేసుకోవచ్చు. స్మూతీల్లో అవిసె గింజలు కలిపి తీసుకోవడం వల్ల కడుపు నిండిన ఫీల్ వస్తుంది. దీంతో బరువు తగ్గేందుకు, పొట్ట కరిగేందుకు అవకాశం లభిస్తుంది.
పెరుగులో అవిసె గింజలు యాడ్ చేసి తినడం వల్ల బరువు తగ్గొచ్చు. ఈ రెండిటీని కలిపి తినడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. దీంతో కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి. కొవ్వు కరుగుతుంది. మీరు తినే కూరగయాలు, పండ్ల సలాడ్స్‌లో కూడా అవిసె గింజలను యాడ్ చేసుకోవచ్చు. అవిసె గింజలు యాడ్ చేసిన సలాడ్స్ తింటే జీర్ణ సమస్యలు రావు. బరువు తగ్గొచ్చు. అవిసె గింజల నూనెలో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది. వంటల్లో, సలాడ్స్‌లో ఈ నూనెను యాడ్ చేసుకోవచ్చు.
ప్లాక్స్ సీడ్ బాల్స్ తినడం వల్ల శారీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ఇవి బరువు తగ్గడానికి సాయపడతాయి. ప్లాక్స్ సీడ్ బాల్స్ తింటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. వేయించిన అవిసె గింజలు తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం లభిస్తుంది. వేయించిన ప్లాక్స్ తినడం వల్ల పొట్ట వేగంగా కరుగుతుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..