శీతాకాలంలో చలి కారణంగా చాలా మంది చర్మం పొడిగా మారుతుంది. ఈ సమయాల్లో చర్మాన్ని రక్షించేందుకు కొబ్బరి నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే జిడ్డుగల చర్మం, మొటిమలు ఉన్నవారికి ఇది రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తుంది. ఇందుకోసం మీరు ఫేస్ వాష్ ఉపయోగించే ముందు ముఖానికి కాస్తా కొబ్బరి నూనె రాసుకోవడం ద్వారా చర్మంపై ఉన్న మురికి, ఇతర మలినాలు తొలగిపోతాయి.
కొబ్బరి నూనె చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, మృదువుగా ఉంచడానికి, దాని సహజ నూనెలను తొలగించకుండా ముడతలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని మృదువుగా, సాఫ్ట్‌గా మారుస్తుంది. చాలా అధ్యయనాల్లో మినరల్ అయిత్ కంటే కొబ్బరి నూనె బాగా పనిచేస్తుందని తేలింది
మీరు ఉత్తమ ఫలితాల పొందేందుకు మీ ముఖం, మెడ ప్రాంతాల్లో కొబ్బరి నూనెను అప్లై చేసి, కాసేపు బాగా మసాజ్ చేయండి. తర్వాత ఓ క్లాత్ తీసుకొని దాన్ని గోరువెచ్చని నీటిలో ముంచి.. మీరు కొబ్బరి నూనే పూసిన ప్రాంతాన్ని మృదువుగా తుడవండి. ఇలా చేయడం ద్వారా చర్మంపై ఉన్న మలినాలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
మీరు రాత్రి పడుకునే ముందు చర్మానికి అవసరమైన తేమను అందించడానికి కొబ్బరి నూనెను ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం మీరు రాత్రి ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని కొబ్బరి నూనెను అప్లై చేసుకొండి. మార్నింగ్ వరకు అలానే ఉంచి తర్వాత గొరు వెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కొండి. ఇలా చేయడ ద్వారా ముఖం మెరిసి, యవ్వనంగా కనిపిస్తుంది.
కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లను నియంత్రిస్తుంది. మొటిమలు, తామర, చర్మ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల చర్మ మంట, చికాకు, సోరియాసిస్ వంటివి ఉపశమనం కలిగిస్తాయి.( Note: ఈ వ్యాసంలో పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)




