Bank Holidays: చాలా మంది ప్రతి రోజు బ్యాంకు పని నిమిత్తం వెళ్తుంటారు. వివిధ లావాదేవీలు చేసుకునే వారు ఎక్కువగా బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. కొన్ని ఆన్‌లైన్ లావాదేవీలు చేసినప్పటికీ కొన్ని లావాదేవీలకు సంబంధించిన పనులను తప్పకుండా బ్యాంకులను ఆశ్రయించాల్సిందే. అయితే ప్రతి నెల ఆర్బీఐ బ్యాంకులకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. ఈ ఆగస్ట్ నెలలో బ్యాంకులకు చాలా రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. ప్రతి రోజు బ్యాంకు పనులను చేసుకునే వారు బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవు ఉంటుందో ముందస్తుగా గమనించడం చాలా ముఖ్యం. సెలవులను బట్టి ప్లాన్ చేసుకుంటే ఆర్థికంగా కొంత నష్టపోకుండా ఉండటంతో పాటు సమయం వృధా కాకుండా ఉండవచ్చు. ఇప్పుడు ఈ వారంలో బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Bike Servicing: బైక్‌ను ఎన్ని కి.మీ తర్వాత సర్వీస్ చేయాలి? సరైన సమయం ఏది?
ఆగస్టు 8, శుక్రవారం. సిక్కిం, ఒడిశా ప్రాంతాల్లో సెలవు (గిరిజన పండుగ.. టెండాంగ్‌లో రమ్ ఫండ్). అలాగే వరలక్ష్మీ వ్రతం. దీంతో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అలాగే ఆగస్టు 9 శనివారం. రెండో శనివారం సాధారణ సెలవు. అలాగే ఇదే రోజు రక్షా బంధన్ పండుగ. బ్యాంకులు మూసి ఉంటాయి. ఇక మరుసటి రోజు ఆగస్టు 10 ఆదివారం. ఈ రోజు సాధారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి: Viral Video: భద్రం బ్రదర్ అంటున్న పోలీసులు.. ఈ యాక్సిడెంట్ చూస్తే రోడెక్కాలంటే వణుకు పుడుతుంది
ఇలా చూసుకుంటే వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. అందుకే వినియోగదారులు ముందస్తుగా సెలవులను గమనించి బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవడం మంచిది. అయితే బ్యాంకులకు ఉండే సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చని గుర్తించుకోండి. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని సెలవు ఉంటుంది.
ఇది కూడా చదవండి: AP School Holidays: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాఠశాలలకు భారీగా సెలవులు.. విద్యార్థులకు పండగే..!
ఇది కూడా చదవండి: Traffic Challans: గుడ్‌న్యూస్.. మీ వాహనంపై చలాన్లు ఉన్నాయా? సగం డబ్బులు మాఫీ!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి