Auto News: కళ్లు చెదిరిపోయే ఆఫర్‌.. ఈ కారుపై రూ.2.30 లక్షల డిస్కౌంట్‌

Auto News: కళ్లు చెదిరిపోయే ఆఫర్‌.. ఈ కారుపై రూ.2.30 లక్షల డిస్కౌంట్‌


ఈ రోజుల్లో చాలా మందికి కారు కొనాలనే కల ఉంటుంది. కానీ అందరికి నెరవేరకపోవచ్చు. ఇప్పుడు కార్ల తయారీ సంస్థలు వారి కలను నేరవేర్చుకునే విధంగా రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. తక్కువ ధరల్లోనే కార్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి కంపెనీలు. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జేఎన్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ భారత్‌లో తన ప్రస్తానాన్ని కొనసాగిస్తోంది. భారత్‌లో ఈ కంపెనీ కార్ల అమ్మకాలు మొదలు పెట్టి ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ తన హెక్టార్, హెక్టార్‌ ప్లస్‌ ఎస్‌యూవీ మోడళ్లపై భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. ఇది పరిమిత కాల ఆఫర్‌గా పేర్కొంది కంపెనీ. వాహనాదారులు ఎంచుకున్న మోడళ్లను బట్టి డిస్కౌంట్‌ను అందించనున్నట్లు తెలిపింది. ఆయా ఎస్‌యూవీలపై గరిష్టం 2.30 లక్షల వరకు డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు ప్రకటించింది.

ఇది కూడా చదవండి: AP School Holidays: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. పాఠశాలలకు భారీగా సెలవులు.. విద్యార్థులకు పండగే..!

ఈ సంస్థ భారత్‌లో 2019లో అడుగు పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తోంది. ఎంజీ హెక్టార్‌ దేశంలో మొట్టమొదటి ఇంటర్నెట్-కనెక్డెడ్‌ ఎస్‌యూవీగా పేరు పొందింది. SW MG మోటార్ ఇండియా భారతదేశంలో తన ఆరవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. దాని వేడుకలలో భాగంగా బ్రాండ్ హెక్టర్, హెక్టర్ ప్లస్ SUVల ధరలను భారీగా తగ్గించింది. ఈ ధర మార్పులు పరిమిత కాలానికి వర్తిస్తాయి. వినియోగదారు ఎంచుకున్న మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటాయని గుర్తించుకోండి.

ఇవి కూడా చదవండి

డ్యూయల్‌ పేన్‌ పనోరమిక్‌ సన్‌రూఫ్, డిస్‌ప్లే:

ఈ కారుకు డ్యూయల్‌ పేన్‌ పనోరమిక్‌ సన్‌రూఫ్, 14 అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఉంది. అలాగే 70కి పైగా కనెక్టెడ్‌ కార్‌ ఫీచర్లు, అడ్వాన్స్‌డ్‌ ADAS భద్రతా సదుపాయాలు ఇందులో ఉన్నాయి. అయితే తాజా ఆఫర్‌లో భాగంగా హెక్టార్‌లోని అన్ని వేరియంట్లపైనా గణనీయమైన తగ్గింపులను ప్రకటించారు. షార్ప్‌ ప్రో 1.5 పెట్రోల్ ఎంఎన్‌టీ వేరియంట్‌పై అత్యధికంగా రూ.2.14 లక్షల వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఈ కారును రూ.19 లక్షలకే (ఎక్స్‌షోరూమ్‌ ధర) లభిస్తుంది. స్నోస్టార్మ్‌, బ్లాక్‌స్టార్మ్‌ వేరియంట్ల ధరలపైనా కూడా భారీగా డిస్కౌంట్‌లు ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Gold Price Today: పెరుగుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్‌ ధర ఎంతంటే..

6సీటర్స్‌ వేరియంట్లపై తగ్గింపు:

హెక్టార్ ప్లస్‌ 6 సీటర్ అన్ని వేరియంట్లపై కూడా ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. షార్ప్‌ ప్రో 1.5 పెట్రోల్ ఎంఎన్‌టీ వేరియంట్‌పై గరిష్ఠంగా రూ.2.30 లక్షల వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. హెక్టార్‌ ప్లస్‌ 7 సీటర్‌ వేరియంట్లలోనూ షార్ప్‌ 1.5 పెట్రోల్ వేరియంట్‌పైన కూడా రూ.2.30 లక్షల, సెలెక్ట్‌ ప్రో, షార్ప్‌ ప్రో, బ్లాక్‌స్టార్మ్‌, స్నోస్టార్మ్‌, సావీ ప్రో వంటి ట్రిమ్స్‌పై రూ.2 లక్షల వరకు డిస్కౌంట్లు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ప్రస్తుతం అందించే డిస్కౌంట్లు కొన్ని రోజులు మాత్రమేనని తెలిపింది. ఇక బేస్‌ వేరియంట్‌ స్టైల్‌ ట్రిమ్‌ ధర రూ.25 వేలు పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఇక్కడ క్లిక్ చేయండి :Aaquarium Fish: అక్వేరియంలో చేపలు త్వరగా చనిపోతున్నాయా? ఇలా చేస్తే ఎక్కువ కాలం బతుకుతాయి!

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *