గాంధీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. మహిళకు పునర్జన్మ
హైదరాబాద్ సికింద్రాబాద్‌లోని గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మరో అరుదైన వైద్య ఘనత సాధించారు. ప్రాణాంతక స్థితిలో ఉన్న 41 ఏళ్ల జాహెదా బేగం అనే మహిళకు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. స్వల్ప కడుపు నొప్పితో గాంధీ ఆసుపత్రిలో చేరిన మహిళకు నిర్వహించిన పరీక్షల్లో కుడి కిడ్నీలో భారీ కణితి ఉన్నట్లు తేలింది. యూరాలజీ విభాగంలో సి.ఇ.సి.టి, ఎం.ఆర్.ఐ, డాప్లర్ స్కానింగ్‌లు చేయగా, కణితి కిడ్నీని దాటి శరీరంలోని ప్రధాన రక్తనాళమైన…