Viral Video: మంచు కొండల్లో జరిగిన పెళ్లి.. అక్షింతలుగా హిమపాతం..! వెడ్డింగ్ సీన్ వైరల్..
వసంత పంచమి నాడు ఉత్తరాఖండ్‌లోని మంచుతో కప్పబడిన లోయలలో ఆవిష్కృతమైన ఒక దృశ్యం సోషల్ మీడియాను ఆకర్షించింది. మీరట్‌కు చెందిన ఒక జంట త్రియుగినారాయణ ఆలయంలో భారీ హిమపాతం మధ్య వివాహం చేసుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. చుట్టూ కురుస్తున్న మంచు, అందంగా అలంకరించబడిన పెళ్లి మండపం ఈ వివాహాన్ని మరింత ప్రత్యేకంగా చేశాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… గత కొన్ని రోజులుగా పర్వతాలలో భారీ హిమపాతం కురుస్తోంది. జనవరి 23 శుక్రవారం రోజున…