Phone Tapping Case: బీఆర్‌ఎస్ మాజీ ఎంపీకి సిట్ నోటీసులు.. సంతోష్ ఏమన్నారంటే.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సిట్ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) వేగవంతం చేసింది. ఈ క్రమంలో.. బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది.. ఈ మేరకు సిట్ అధికారులు విచారణకు రావాలంటూ మాజీ ఎంపీ సంతోష్‌రావుకు సోమవారం నోటీసులు ఇచ్చారు.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు రావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. 160 సీఆర్‌పీసీ ప్రకారమే సంతోష్‌కి నోటీసులు వెళ్లాయి. అయితే.. సంతోష్‌ని ఎంపీగానే పేర్కొంటూ సిట్…