ఎక్సైజ్ అధికారి జాతీయ జెండావిష్కరించి గ్రూప్ ఫోటో దిగుతుండగా షాకింగ్ ఘటన.. !
మహారాష్ట్రలోని ధరాశివ్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక ఎక్సైజ్ అధికారి కుప్పకూలిపోయాడు. వేడుక జరుగుతుండగా ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణించినట్లు అధికారులు తెలిపారు. ఒమెర్గా తహసీల్‌లోని తల్మోడ్ సరిహద్దు చెక్‌పాయింట్ వద్ద జెండా ఎగురవేసే కార్యక్రమం జరుగుతోంది. వేడుక తర్వాత, 56 ఏళ్ల మోహన్ జాదవ్ సిబ్బందితో కలిసి గ్రూప్ ఫోటో కోసం నిలబడి ఉండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి సిబ్బంది…