AUS Vs ZIM: ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చిన ‘బ్లెస్సింగ్’.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్ ఎలైట్ జాబితాలో ఎంట్రీ..

AUS Vs ZIM: ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చిన ‘బ్లెస్సింగ్’.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్ ఎలైట్ జాబితాలో ఎంట్రీ..


Blessing Muzarabani: శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే అజేయంగా నిలిచి చరిత్ర సృష్టించిం. మరోసారి ఆసీస్ జట్టును ఓడించి సూపర్ 8లో కేవలం మరో అడుగు దూరంలో నిలిచింది. ఆస్ట్రేలియా జింబాబ్వే జట్టుపై గెలుస్తుందని భావించారు, కానీ దానికి విరుద్ధంగా జరిగింది. బ్లెస్సింగ్ ముజారబానీ ఈ షోలో స్టార్ గా నిలిచాడు. ఈ లాంకీ పేసర్ బంతితో ఆస్ట్రేలియన్ బ్యాటర్లను చిత్తు చేశాడు. ఏకంగా 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటి, మ్యాచ్ ను ఆస్ట్రేలియాకు దూరం చేశాడు.

చరిత్ర సృష్టించిన ముజారబానీ

ఆస్ట్రేలియాపై 4 వికెట్లు పడగొట్టిన ముజారబానీ టీ20 ప్రపంచ కప్ చరిత్ర పుస్తకాలలో తన పేరును లిఖించుకున్నాడు. కొలంబోలో ఈ పేసర్ 17 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. ఇది టీ20 ప్రపంచ కప్‌లలో జింబాబ్వే బౌలర్ చేసిన ఉత్తమ బౌలింగ్ గణాంకాలుగా నిలిచాయి. గతంలో వెల్లింగ్టన్ మసకడ్జా 2016 సీజన్‌లో స్కాట్లాండ్‌పై 28 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు.

ముజారబాని ఈ ఎలైట్ జాబితాలో మసకద్జాను దాటాడు. అతని సంచలనాత్మక స్పెల్ ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ లైనప్‌ను నాశనం చేసింది. అతని బాధితులుగా జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాట్ రెన్‌షా, ఆడమ్ జంపా మారారు. నాలుగు వికెట్లలో, రెన్‌షా వికెట్ కీలకం. ఎందుకంటే, ఈ ఆసీస్ ఆటగాడు 65 పరుగులతో జింబాబ్వేకు విలన్ గా మారాడు. ఆస్ట్రేలియా తరపున అత్యధిక స్కోర్ చేసి కొద్దిసేపు జింబాబ్వే విజయాన్ని అడ్డుకున్నాడు.

టీ20 ప్రపంచ కప్ తొలి ఎడిషన్‌లో ఇంగ్లాండ్‌ను 4 వికెట్లతో చిత్తు చేసిన బౌలర్, జింబాబ్వే దిగ్గజ ఆటగాడు ఎల్టన్ చిగుంబురా మూడవ స్థానంలో నిలిచాడు.

2014లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఎడిషన్‌లో ఐరిష్ జట్టుపై తినాషే పన్యాంగర 37 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నాడు.

ముజరబానీ బ్రేక్ చేసిన రికార్డులు..

టీ20 ప్రపంచ కప్‌లలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేయడమే కాకుండా, జింబాబ్వే పేసర్ తన అద్భుత ప్రదర్శనలో మరో భారీ సెంచరీ మైలురాయిని కూడా సాధించాడు. 4 వికెట్లతో, టీ20లలో 100 వికెట్లు తీసిన తన దేశం నుంచి మూడవ బౌలర్‌గా నిలిచాడు.

ఈ జాబితాలో మొదటి ఇద్దరు రిచర్డ్ న్గారవ (111 వికెట్లు), సికందర్ రజా (103 వికెట్లు), ఇప్పుడు, ముజరబాని కూడా తన జట్టు తరపున 100 వికెట్ల క్లబ్‌లోకి ప్రవేశించాడు.

అలాగే టీ20 ప్రపంచ కప్‌లో ఆసీస్‌పై ఇది రెండవ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. భారత మాజీ స్పిన్నర్ ఆర్ అశ్విన్, 2014 ఎడిషన్‌లో ఆసీస్‌పై 11 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు.

కుడిచేతి వాటం పేసర్ ఇప్పుడు రెండవ స్థానంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ గుల్బాదిన్ నయీబ్ 2024 టీ20 ప్రపంచ కప్‌లో 4/20 గణాంకాలతో మూడవ స్థానంలో ఉన్నాడు.

సూపర్ 8 అంచున జింబాబ్వే..

టోర్నమెంట్‌లో జింబాబ్వే తమ తొలి మ్యాచ్‌ను ఒమన్‌తో అద్భుతంగా గెలిచింది. కానీ వారి ముందు ఆస్ట్రేలియన్ జట్టు చాలా క్లిష్టంగా ఉంది. క్లిష్టమైన వికెట్‌పై జింబాబ్వే 169/2 స్కోరు చేసింది. ఇదే స్కోర్ కొలంబోలో 23 పరుగుల తేడాతో విజయం సాధించడానికి సరిపోయింది.

ముజారబాని ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపించాడు. ఈ పేసర్ క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా జట్టు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది. దీంతో పరుగుల ప్రవాహాన్ని కూడా ఈ జింబాబ్వే బౌలర్ ఆపాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *