Athadu: అతడు: ది టైమ్ లెస్ క్లాసిక్.. 20 ఏళ్ల తర్వాత కూడా తగ్గని క్రేజ్..!

Athadu: అతడు: ది టైమ్ లెస్ క్లాసిక్.. 20 ఏళ్ల తర్వాత కూడా తగ్గని క్రేజ్..!


‘అతడు’.. రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఈ సినిమా ఒక టైమ్‌లెస్ క్లాసిక్. టీవీలో ఎన్ని వందల సార్లు వచ్చినా, ఛానెల్ మార్చకుండా అలాగే టీవీకి అతుక్కుపోయేలా చేయడం ఈ సినిమాకే సొంతం. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ వచ్చి ఉండొచ్చు కానీ.. ‘అతడు’ సినిమాలో ఉన్న మ్యాజిక్ మాత్రం చాలా స్పెషల్. అందుకే ఇన్నేళ్లయినా ఈ సినిమా గురించి ఎక్కడో ఒకచోట చర్చ జరుగుతూనే ఉంటుంది.. అభిమానులు ఈ సినిమాను ఓన్ చేసుకుంటూనే ఉంటారు. ఈ సినిమా గొప్పతనం గురించి మాట్లాడుకుంటే ముందుగా చెప్పుకోవాల్సింది డైలాగ్స్ గురించే. త్రివిక్రమ్ పెన్ పవర్ ఏంటో చూపించిన ఈ సినిమా డైలాగ్స్‌కు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. యాక్షన్, ఎమోషన్ కలిసిన సీన్స్, సిట్యుయేషన్స్ అయితే వేరే లెవెల్.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

ఒక్కో సీన్, ప్రతి సీక్వెన్స్ ప్రేక్షకులకు ఒక కొత్త ఫీలింగ్‌ను ఇస్తూ.. ఎప్పటికీ బోర్ కొట్టని ఒక ఎవర్‌గ్రీన్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుతాయి. ఇక సెకండాఫ్‌లో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్స్ సినిమాకు ప్రాణం పోశాయి. పల్లెటూరి వాతావరణం, ఉమ్మడి కుటుంబంలోని ఎమోషన్స్‌ను చాలా అందంగా చూపించారు. వీటన్నింటికీ మించి బ్రహ్మానందం కామెడీ ట్రాక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్రహ్మి కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో మీమ్ క్రియేటర్స్‌కు అతడులోని బ్రహ్మానందం క్యారెక్టర్ ఎప్పటికీ దొరికే ఒక కంటెంట్ గని లాంటిది. ఇలాంటి క్లాసిక్ సినిమాను బిగ్ స్క్రీన్ మీద మళ్ళీ చూడాలనే అభిమానుల కోరిక మేరకు గతంలో ఒకసారి రీ రిలీజ్ చేస్తే, కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పుడు ఆ మ్యాజిక్‌ను మళ్ళీ రిపీట్ చేస్తూ ఫిబ్రవరి 28న మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సెకండ్ రీ రిలీజ్ హక్కులను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా 40 లక్షలకు కొనుగోలు చేశారు. దీన్ని బట్టే ‘అతడు’ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అర్థం చేసుకోవచ్చు. ఈ రెండో రీ రిలీజ్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో ‘ఏషియన్ సినిమాస్’ ద్వారా లక్ష్మీ నరసింహ సినిమాస్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఇన్నేళ్లయినా ఒక సినిమా కోసం థియేటర్ల ముందు క్యూ కట్టడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారంటే.. అది మహేష్ బాబు ఆరా, త్రివిక్రమ్ టేకింగ్.. ‘అతడు’ సృష్టించిన ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. ఈ ఫిబ్రవరి 28న థియేటర్లలో మళ్ళీ ఆ గుడి.. ఆ పార్థు మ్యాజిక్ రిపీట్ కావడం ఖాయం.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *