Asia Cup 2025 : ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ డ్రా అయిన తర్వాత టీమిండియా నెక్ట్స్ టార్గెట్ ఆసియా కప్ 2025. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యూఏఈలో జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కోసం భారత జట్టులో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? ఏయే ఆటగాళ్లకు అవకాశం లభిస్తుంది? సూర్యకుమార్ యాదవ్, బుమ్రా వంటి సీనియర్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందనే వార్తలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆసియా కప్ 2025 కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ నెలలో యూఏఈలో జరగనుంది. భారత్ గ్రూప్ Aలో పాకిస్థాన్, యూఏఈ, ఒమాన్‌తో కలిసి ఉంది. ఈ టోర్నమెంట్ కోసం భారత జట్టులో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల హర్నియా సర్జరీ చేయించుకున్నాడు. అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్‌లో ఆడే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. అతనితో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. వీరిద్దరూ టీ20 వరల్డ్ కప్ కోసం సన్నద్ధం కావాల్సి ఉండటంతో, సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకోవచ్చు.
సూర్యకుమార్ యాదవ్ గైర్హాజరీలో, జట్టు సారథ్య బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో యువ ఆటగాళ్లైన శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ ఆసియా కప్ జట్టులో తమ స్థానాలను పదిలం చేసుకునే అవకాశం ఉంది. స్థిరంగా రాణిస్తున్న శ్రేయాస్ అయ్యర్ కూడా జట్టులో చోటు దక్కించుకోవచ్చు. కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో యువ బ్యాట్స్‌మెన్లు సంజు శాంసన్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్, రింకూ సింగ్లకు కూడా చోటు లభించవచ్చు.
ఆల్ రౌండర్ల విషయంలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లకు బాధ్యతలు అప్పగించవచ్చు. పేస్ బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ వంటి యువ పేసర్లు ఉండవచ్చు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు అవకాశం ఉంది. వరుణ్ చక్రవర్తి టీ20ల్లో తిరిగి వచ్చిన తర్వాత అద్భుతంగా రాణించాడు.
ఆసియా కప్ కోసం భారత్ జట్టు:
బ్యాట్స్‌మెన్లు: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకూ సింగ్.
వికెట్ కీపర్లు: సంజు శాంసన్, ధ్రువ్ జురెల్.
ఆల్ రౌండర్లు: హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్.
బౌలర్లు: ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ సిరాజ్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..