Asia Cup 2025: ఆసియాకప్‌లో భారత్, పాక్ మ్యాచ్‌‌కు వేదిక ఫిక్స్.. ఎక్కడంటే?

Asia Cup 2025: ఆసియాకప్‌లో భారత్, పాక్ మ్యాచ్‌‌కు వేదిక ఫిక్స్.. ఎక్కడంటే?


India vs Pakistan: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 షెడ్యూల్ ఖరారైంది. ఈసారి టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరగనుంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు దుబాయ్, అబుదాబి వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ ఎడిషన్ ప్రత్యేకత ఏమిటంటే, వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ టోర్నమెంట్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు.

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు?

టోర్నమెంట్‌లో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ భారత్-పాకిస్తాన్ మధ్య జరగనుంది. గ్రూప్ స్టేజ్‌లో ఈ రెండు జట్లు సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. భారత్, పాకిస్తాన్ గ్రూప్ Aలో ఉన్నాయి. ఈ గ్రూప్‌లో యూఏఈ, ఒమన్ కూడా ఉన్నాయి. మరోవైపు గ్రూప్ Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి.

షెడ్యూల్ వివరాలు:

వేదికలు: దుబాయ్, అబుదాబి

ఇవి కూడా చదవండి

ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 9, 2025

ఫైనల్ మ్యాచ్: సెప్టెంబర్ 28, 2025

భారత్ మ్యాచ్‌లు:

సెప్టెంబర్ 10: భారత్ vs యూఏఈ, దుబాయ్

సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్తాన్, దుబాయ్

సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్, అబుదాబి

ఎందుకు యూఏఈలో?

సాధారణంగా ఆతిథ్య హక్కులు భారత్‌కు ఉన్నప్పటికీ, భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాలు ఒకరి గడ్డపై మరొకరు ఆడకూడదని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో, 2027 వరకు తటస్థ వేదికలపై మాత్రమే ఆడాలని బీసీసీఐ, పీసీబీ ఒప్పందం చేసుకున్నాయి. అందుకే ఈ టోర్నమెంట్ మొత్తం యూఏఈలో నిర్వహిస్తున్నారు.

మూడు మ్యాచ్‌‌ల్లో తలపడే ఛాన్స్..

ఈసారి ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ జట్లు మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. గ్రూప్ స్టేజ్‌లో ఒక మ్యాచ్, ఆ తర్వాత రెండు జట్లు సూపర్ ఫోర్‌కు అర్హత సాధిస్తే మరో మ్యాచ్, ఆపై ఫైనల్‌కు చేరుకుంటే మూడో మ్యాచ్ కూడా జరగవచ్చు. ఈ మెగా టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ ఈసారి కూడా టైటిల్‌ను నిలబెట్టుకోవాలని ఆశిస్తోంది. ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్, యూఏఈ, ఒమన్ జట్లు పాల్గొననున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *