ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాల్లో అలరించిన చిన్నారులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మారారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. మరికొందరు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ వివిధ రంగాల్లో సెటిల్ అయ్యారు. అలాంటి వారిలో అరుంధతి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఒకరు. ఈ సినిమాలో చిన్నప్పటి అరుంధతి పాత్రలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. చక్కటి రూపం, అద్భుతమైన నటనతో జనాలను కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. కానీ కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన ఫ్రెండ్స్ తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతకీ ఈ అమ్మడు గుర్తుందా.. ?
ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..
అరుంధతి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన అమ్మాయి పేరు దివ్య నగేశ్. తెలుగు, తమిళ మూలాలున్న కుటుంబానికి చెందిన ఈ అమ్మడు..అరుంధతి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో పవర్ ఫుల్ నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత సింగం పులి, అపరిచితుడు చిత్రాల్లో నటించింది. చదువుల దృష్ట్యా సినిమాలకు దూరమైన ఈ అమ్మడు.. ఇప్పుడు డ్యాన్స్ర్ గా, మోడల్ గా చేస్తుంది. ఇక ఇప్పుడు తన ప్రియుడితో కలిసి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?
గత ఐదేళ్లుగా సహనటుడు, కొరియోగ్రాఫర్ అజయ్ కుమార్ ను ప్రేమిస్తున్న దివ్య.. ఈ ఏడాది జనవరిలోనే నిశ్చితార్థం చేసుకుంది. మరో 8 రోజుల్లో అంటే ఆగస్ట్ 18న వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ క్రమంలోనే వెడ్డింగ్ ఫోటోషూట్స్ లో దివ్య బిజీగా ఉంది. తాజాగా తన స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అప్పుడే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇవి కూడా చదవండి : Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?

Arundhati Child Artist
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..
ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..