యాపిల్ పండ్లలో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది ప్రీ బయోటిక్‌గా పనిచేస్తుంది. అందువల్ల జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు సరిగ్గా ఉంటుంది. యాపిల్‌లో ఉండే ఫైటోకెమికల్స్ గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. అంతేకాదు ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తుంది. యాపిల్‌లో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు కూడా పెరగరు.
రోజుకో యాపిల్ తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. యాపిల్ పండ్లలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే కళ్లలో శుక్లాలు అనే సమస్య రాకుండా చూసుకోవచ్చు.
యాపిల్ పండును రోజుకు ఒకటి తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్ రాదు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
యాపిల్ రోజూ తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. పొట్ట కొవ్వు కరుగుతుంది. డయాబెటిస్ రాకుండా యాపిల్ పండ్లు మనల్ని రక్షిస్తాయి. రోజుకు ఒక యాపిల్‌ను తినడం వల్ల జ్ఞాపకశక్తి సైతం పెరుగుతుంది. దీంతో మెదడు యాక్టివ్‌గా ఉంటుంది.
యాపిల్ పండ్లు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. యాపిల్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులు డ్యామేజ్ అవకుండా చూస్తాయి. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయే కఫాన్ని కరిగిస్తాయి.
దీంతోపాటు ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీని వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు రావు. అలాగే దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.