AP EAPCET 2026: ఏపీ ఈఏపీసెట్‌ 2026 పూర్తి నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

AP EAPCET 2026: ఏపీ ఈఏపీసెట్‌ 2026 పూర్తి నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్‌ ప్రొఫెషనల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 206-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు స్టేట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 (ఈఏపీసెట్‌) పూర్తి నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్‌టీయూకే) నిర్వహించనుంది. అర్హులైన అభ్య‌ర్థులు మార్చి 7 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ లేదా బైపీసీలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. ఏపీ ఈఏపీసెట్‌ 2026లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఇంజినీరింగ్, బయో-టెక్నాలజీ, బీటెక్‌ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్‌ (అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌), బీటెక్‌ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ), బీఎస్సీ (అగ్రి)/ బీఎస్సీ (హార్జికల్చర్‌)/ బీవీఎస్సీ & ఏహెచ్‌/ బీఎఫ్‌ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మ్.డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.800, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులు రూ.700, బీసీ అభ్యర్థులు రూ.750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

  • ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 7, 2026.
  • రూ 1000 ఆలస్య రుసుముతో: మార్చి 12 వరకు
  • రూ.2000 ఆలస్య రుసుముతో: మార్చి 17వరకు
  • రూ.4000 ఆలస్య రుసుముతో: మార్చి 21 వరకు
  • రూ.10 వేల ఆలస్య రుసుముతో: మార్చి 26 వరకు
  • దరఖాస్తు సవరణ తేదీలు: మార్చి 26 నుంచి 28 వరకు
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: ఏప్రిల్‌ 28 నుంచి
  • ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు: మే 12, 15, 18 తేదీల్లో
  • అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షలు: మే 19, 20 తేదీల్లో
  • ప్రిలిమినరీ పరీక్ష కీ (ఇంజినీరింగ్‌ అండ్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ): మే 23, 2026.
  • అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ: మే 25, 2026.
  • ఫలితాల విడుదల తేదీ: జూన్‌ 1, 2026.

ఏపీ ఈఏపీసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *