ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2026-27 గానూ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. శనివారం (ఫిబ్రవరి 14) ఉదయం 11:15కి ఏపీ శాసనసభ ముందు ఉంచారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు మంత్రు పయ్యావుల తెలిపారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని.. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగుల పెట్టించాలనే సంకల్పంతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ఉదయం 10.30కి బడ్జెట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. బడ్జెట్ అనంతరం శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. అలాగే శాసనమండలిలో వార్షిక బడ్జెట్‌ను హోంమంత్రి అనిత ప్రవేశపెట్టనుండగా.. వ్యవసాయ బడ్జెట్‌ను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..