AP Budget: రాష్ట్ర బడ్జెట్‌లో శాఖల వారీగా.. వివిధ సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలకు కేటాయింపులు

AP Budget: రాష్ట్ర బడ్జెట్‌లో  శాఖల వారీగా.. వివిధ సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలకు కేటాయింపులు


ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం తన అదృష్టమని మంత్రి కేశవ్ అన్నారు. అభివృద్ధి, సంక్షమమే లక్ష్యంగా బడ్జెట్‌ రూపొందించినట్లు మంత్రి చెప్పారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల కాదని.. ఏపీ ప్రజల భవిష్యత్ కలలను సాకారం చేసేది బడ్జెట్‌ అన్నారు. గృహిణికి భరోసా ఇచ్చేది బడ్జెట్‌ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండిలో పరుగులు పెట్టించాలనే సంకల్పంతో బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి కేశవ్ స్పష్టం చేశారు.

ఎన్నో సవాళ్లు ఉన్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో రాష్ట్రం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి జరిగిందని మంత్రి పయ్యావుల కేశశ్ అన్నారు. ఇప్పటి వరకు ఏం సాధించాం… ఇంకా ఏం సాధించాలనే అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించామని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ బడ్జెట్‌ను తీర్చిదిద్దామన్నారు. కాగితాలకే పరిమితం కాకుండా… క్షేత్ర స్థాయిలో సంక్షేమాన్ని అమలు చేయడమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ఏడాదే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశామని మంత్రి వెల్లడించారు. ఈ చొరవతోనే 11.75 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. 2025-26వ ఆర్థిక సంవత్సరంలో కూడా సీఎం చంద్రబాబు నేతృత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో రెండంకెల వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. 2025-26 ఏడాదిలో కూడా 10.75 శాతం మేర వృద్ధి నమోదు అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేశామన్నారు. 2025-26వ ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ ఏపీలో వృద్ధి రేటు సాధించామన్నారు.

2026–27 బడ్జెట్ – ప్రధాన శాఖల కేటాయింపులుః

పాఠశాల విద్య (School Education): రూ. 32,308.32 కోట్లు

బీసీ సంక్షేమం (BC Welfare): రూ. 23,650.88 కోట్లు

గ్రామీణాభివృద్ధి – పీఆర్&ఆర్డీ (PR&RD): రూ. 22,941.54 కోట్లు

ఆరోగ్యం (Health): రూ. 19,306.04 కోట్లు

జల వనరులు (Water Resources): రూ. 18,223.67 కోట్లు

పురపాలక శాఖ – ఎంఏయూడీ (MAUD): రూ. 14,538.68 కోట్లు

ఇంధనం (Energy): రూ. 13,934.25 కోట్లు

వ్యవసాయం (Agriculture): రూ. 11,745.21 కోట్లు

సామాజిక సంక్షేమం (Social Welfare): రూ. 11,118.84 కోట్లు

ఈడబ్ల్యూఎస్ సంక్షేమం (EWS Welfare): రూ. 10,699.33 కోట్లు

తల్లికి వందనం – రూ. 9,668 కోట్లు

మహిళా & శిశు సంక్షేమం – రూ. 4,581 కోట్లు

స్కాలర్‌షిప్స్ (RTF & MTF) : రూ. 3,836 కోట్లు

సమగ్ర శిక్ష – రూ. 2,946 కోట్లు

ఉన్నత విద్య – రూ. 2,566 కోట్లు

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం – రూ. 2,161 కోట్లు

మన బడి మన భవిష్యత్తు (క్యాపిటల్ వర్క్స్): రూ. 1,500 కోట్లు

నైపుణ్యాభివృద్ధి – రూ. 1,232 కోట్లు

PM స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా: రూ. 707 కోట్లు

సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర: రూ. 654 కోట్లు

యువత అభివృద్ధి & సేవలు – రూ. 438 కోట్లు

వ్యవసాయం & సాగునీరు, ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు (పోలవరం మినహా) – రూ. 9,906 కోట్లు

అన్నదాత సుఖీభవ – రూ. 6,600 కోట్లు

పోలవరం – రూ. 6,105 కోట్లు

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – రూ. 1,927 కోట్లు

ధర స్థిరీకరణ నిధి – రూ. 500 కోట్లు

మత్స్యకార సేవలో – రూ. 260 కోట్లు

పంట బీమా – రూ. 250 కోట్లు

PM కృషి సించాయి యోజన – రూ. 190 కోట్లు

సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలకు కేటాయింపులు:

ఎన్టీఆర్ భరోసా – రూ.27,719 కోట్లు

దీపం 2.0 – రూ.2,601 కోట్లు

వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతు – రూ.2,320 కోట్లు

స్త్రీశక్తి – రూ.1,420 కోట్లు

వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ – రూ.600 కోట్లు

ఆటో డ్రైవర్ల సేవలో – రూ.450 కోట్లు

స్త్రీ, శిశు సంక్షేమం – రూ.4,581 కోట్లు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *