పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్‌ను గురువారం (జూలై 3) రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రముఖ థియేటర్లలో ట్రైలర్ ను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. అలా విమల్ థియేటర్ లో కూడా వీర మల్లు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ హీరోయిన్ నిధి అగర్వాల్, దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం. రత్నం సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే అతిథుల జాబితాలో జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ కూడా ఉన్నాడు. అయితే ఈ ఈవెంట్ కు అతను కాస్త ఆలస్యంగా వచ్చినట్లు తెలుస్తోంది. అప్పటికే భారీగా తరలివచ్చిన అభిమానులతో థియేటర్ నిండిపోయింది. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన అనుదీప్ స్టేజీపైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. కానీ, అక్కడున్న పోలీసులు అతడిని అడ్డుకున్నారు. ముందుకు వెళ్లనివ్వకుండా అనుదీప్‌ను వెనక్కు నెట్టేశారు. అయితే అభిమానుల ఈలలు, కేకల మధ్య అనుదీప్ ను పోలీసులు సరిగ్గా గుర్తించలేదని తెలుస్తోంది. అందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘అయ్యో, అనుదీప్‌ను గుర్తుపట్టలేదా?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో చిత్ర బృందంతో కలిసి అనుదీప్ పాల్గొన్నాడు. సినిమా గురించి కూడా మాట్లాడాడు.
పిట్టగోడ చిత్రంతో దర్శకుడిగా మారాడు అనుదీప్. రెండో సినిమా ‘జాతిరత్నాలు’తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత తమిళ హీరో శివకార్తికేయన్‌తో ప్రిన్స్ మూవీ తీశాడు. ఇది యావరేజ్ గా నిలిచింది. ఇదే క్రమంలో మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, కల్కి 2898 ఏడీ చిత్రాల్లో అతిథి పాత్రలో కనిపించాడు అనుదీప్. ఇప్పుడు పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలోనూ అతను ఓ క్యామియో రోల్ పోషించినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు రిలీజైన వీరమల్లు సాంగ్ లో అనుదీప్ జస్ట్ అలా కనిపించి మాయమైపోయాడు.
ఇవి కూడా చదవండి
నెట్టింట వైరలవుతోన్న వీడియో..
Paavam Anudeeep KV 😂😂🤣🤣😭😭
Andari mundhu paravu poindi ga 😭😭#HHVMTrailer #HariHaraVeeraMallu #HariHaraVeeraMalluTrailer pic.twitter.com/5vauW1ALXn
— Vamc Krishna (@lyf_a_zindagi) July 4, 2025
ఇక హరి హర వీరమల్లు ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..