Anshula Kapoor: డేటింగ్ యాప్‌లో పరిచయం.. ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న జాన్వీ సోదరి.. ఫొటోస్ వైరల్

Anshula Kapoor: డేటింగ్ యాప్‌లో పరిచయం.. ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న జాన్వీ సోదరి.. ఫొటోస్ వైరల్


ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ గారాల పట్టి అన్షులా కపూర్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. తనకు మనసుకు నచ్చినవాడితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన ప్రియుడు రోహన్‌ తక్కర్‌ తన వేలికి ఉంగరం తొడుగుతున్న ఫోటోలను షేర్‌ చేసింది. ‘డేటింగ్‌ యాప్‌ ద్వారా ఒకరికొకరం పరిచయమయ్యాం. మూడేళ్ల క్రితం నాకిష్టమైన న్యూయార్క్‌ నగరంలోని సెంట్రల్‌ పార్క్‌లో ప్రపోజ్‌ చేశాడు. అది కూడా అర్ధరాత్రి 1.15 గంటలకు. అప్పుడు పొద్దున ఆరింటివరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. అప్పుడు ఏదో మ్యాజిక్‌ జరిగినట్లు ఈ ప్రపంచమే కొన్ని క్షణాలపాటు ఆగిపోయినట్లనిపించింది. ఈ ప్రయాణం ఇక్కడి దాకా వస్తుందని నాకప్పుడే అనిపించింది. అతడి చెంత ఉంటే ఇంట్లో ఉన్నట్లే అనిపిస్తుంది. అతని లవ్ ప్రపోజల్‌కు ఓకే చెప్పాను. నా బెస్ట్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది’ అని అన్షులా ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం అన్షులా కపూర్ ఎంగేజ్ మెంట్ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. కుటుంబ సభ్యులు, సినీ అభిమానులు, నెటిజన్లు అన్షులా, రోహన్ లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అన్షులా ఎంగేజ్ మెంట్ పై ఆమె అన్న, ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ‘మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలి. లవ్‌ యూ గయ్స్‌.. ఈరోజు అమ్మను కాస్త ఎక్కువగా మిస్‌ అవుతున్నాను’ అని రాసుకొచ్చాడు. అలాగే జాన్వీ కపూర్‌, ఖుషి కపూర్‌ సైతం.. ‘మా సిస్టర్‌ పెళ్లి చేసుకోబోతుందోచ్‌’ అంటూ ఈ పోస్టుకు కామెంట్స్ పెట్టారు.  రోహన్ ఒక స్క్రిప్ట్‌రైటర్‌గా పనిచేస్తున్నాడు

ఇవి కూడా చదవండి

అన్షులా ఎంగేజ్ మెంట్ ఫొటోస్..

కాగా నిర్మాత బోనీ కపూర్‌ మొదటి భార్య పేరు మోనా శౌరీ కపూర్‌. ఈమె కూడా నిర్మాతే. 1983లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అర్జున్‌ కపూర్‌, అన్షులా కపూర్‌ జన్మించారు. ఆ తర్వాత 1996లో బోనీ మోనాకు విడాకులిచ్చాడు. అదే ఏడాది హీరోయిన్‌ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి జాన్వీ కపూర్‌, ఖుషి కపూర్‌ సంతానం. ఇక మోనా శౌరీ.. 2012లో కన్నుమూయగా, శ్రీదేవి 2018లో ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయింది. జాన్వీ, ఖుషి సవతి తల్లి కూతుర్లయినప్పటికీ అర్జున్‌, అన్షులా.. వారితో ఎంతో అన్యోన్యంగా ఉంటారు.

సోదరుడు అర్జున్ కపూర్ తో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *