సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో రాబోతున్న సినిమా కూలీ. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కీలకపాత్రలు పోషిస్తండడంతో ఈ మూవీపై మంచి హైప్ నెలకొంది. ఆగస్ట్ 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అనిరుధ్ సినిమాల్లోకి ప్రవేశించడం గురించి మాట్లాడారు.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..
ప్రస్తుతం సినిమాల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిరుధ్ కు ముందు నుంచి అండగా ఉంది తాను కాదని అన్నారు. అనిరుధ్ తల్లిదండ్రులు తనను విదేశాలకు పంపించి ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పారని.. కానీ అతడి ఇష్టాన్ని అర్థం చేసుకుని.. అనిరుధ్ తల్లిదండ్రులతో మాట్లాడి .. వారిని ఒప్పించి సినిమాల్లోకి తీసుకువచ్చింది హీరో ధనుష్ అని అన్నారు. సంగీత ప్రపంచంలోకి అనిరుధ్ ఎంట్రీ ఇస్తే ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ పేరు సంపాదించుకుంటాడని అతడి తల్లిదండ్రులను ఒప్పించి మరీ సినిమాల్లోకి తీసుకువచ్చి.. ముందు నుంచి తనకు ఎంతో మద్దతుగా నిలిచారని తెలిపింది. అనిరుధ్ కు కీబోర్డ్ బహుమతి గా ఇచ్చి… తాన డాన్ 3 సినిమాకు మ్యూజిక్ దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చారని.. అనిరుధ్ అరంగేట్రానికి ధనుష్ కారణమని ఐశ్వర్య రజనీకాంత్ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి : Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?
ఐశ్వర్య రజినీకాంత్ 2004లో హీరో ధనుష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల వైవాహిక బంధానికి ఇటీవలే ముగింపు పలికారు. 2024లో వీరిద్దరు అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ వరుస సినిమాల్లో బిజీగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..