పోస్టర్ మీద అనిరుధ్ పేరు కనిపిస్తే చాలు.. సగం సినిమా హిట్టైపోయినట్లే. అందుకే ఆయన అడిగినంత ఇచ్చి మరీ తెచ్చుకుంటున్నారు. తమిళంతో పాటు తెలుగులో, కన్నడలోనూ బిజీగానే ఉన్నారు అని.
గతేడాది దేవరకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన ఈయన.. ప్రస్తుతం కింగ్ డమ్‌తో రప్ఫాడిస్తున్నారు. దేవర 2తో పాటు నాని ది ప్యారడైజ్ లైన్లో ఉన్నాయి. తమిళంలోనూ కూలీ, మదరాసి, జన నాయగన్ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు అనిరుధ్.
మొన్న అనిరుధ్ పాడిన ఆంధ్రాకింగ్ తాలూక సాంగ్‌కు రెస్పాన్స్ మామూలుగా లేదు. ఆయన పాడినా హిట్టే.. పాడించినా హిట్టే అన్నట్లు మారిపోయిందిప్పుడు పరిస్థితి.
టాక్సిక్‌తో కన్నడకు డెబ్యూ ఇస్తున్నారు అనిరుధ్. ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగానే తీసుకుంటున్నారు అనిరుధ్. ఆగస్ట్ అంతా అనిరుధ్ జపమే నడుస్తుంది. ఆల్రెడీ కింగ్డమ్ థియేటర్లలో ఉంది.
ఆగస్ట్ 14న కూలీ విడుదల కానుంది.. దాంతోపాటు శివకార్తికేయన్ మదరాశీ పాట విడుదలైందిప్పుడు.. అలాగే జైలర్ 2, జన నాయగన్ లైన్లో ఉన్నాయి. మొత్తానికి అనిరుధ్ అంటేనే ఫుల్ ట్రెండింగ్ ఇప్పుడు.