పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. మహిళ భద్రత అనేది ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అన్నారు. మహిళల రక్షణ విషయంలో కఠినంగా ఉండాలని నిన్నటి కలెక్టర్ల మీటింగ్లో డీజీపీకి సూచించారు. అలాగే సోషల్ మీడియా విషయంలో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. 16ఏళ్ల లోపు యువత సోషల్ మీడియా వాడకుండా.. బ్యాన్ చేసేలా చట్టం రూపొందిస్తున్నామని చెప్పారు. ఆస్ట్రేలియాలో అమలు అవుతున్న చట్టం పరిశీలిస్తున్నామి తెలిపారు సీఎం.