తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పుష్కర ఘాట్ సమీపంలోని శివాలయంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఆలయంలోని శివలింగానికి చుట్టుకుంటూ నాగుపాము దర్శనమిచ్చింది. ఈ ఘటనతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. శివలింగానికి చుట్టుకున్న నాగుపామును చూసిన భక్తులు శంభో శంకర, హర హర మహాదేవ అంటూ శివస్తుతి చేశారు. ఆలయ పూజారులు శంఖాలను ఊదుతూ. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఈ దృశ్యాన్ని శివుని ప్రత్యక్ష రూపంగా భావిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
అలా పాము దాదాపు గంటపాటు శివలింగాన్ని చుట్టుకునే కనిపించింది. నాగుపాము శివలింగం చుట్టుకుని ఉండటం చూసి, భక్తులు ప్రత్యేక హారతులు సమర్పించి, పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు దీనిని అరుదైన శివానుగ్రహంగా అభివర్ణించారు. నిత్యం అభిషేకాలు, పూజలు చేసే భక్తులు, పూజారులు ఈ అరుదైన సంఘటనను శుభశకునంగా భావించారు. గోదావరి తీరం వద్ద ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం మరింత విశేషంగా చెబుతున్నారు.
వీడియో దిగువన చూడండి…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..