ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా.. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏపీ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి.. ఈనెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే.. ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. నాయి బ్రహ్మణ కుటుంబాలకు అండగా నిలిచేందుకు… హెయిర్ కటింగ్ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. అలానే నేతన్నలకు కూడా ఉచిత కరెంట్‌తో పాటు నేతన్న భరోసా కింద 25వేలు ఇవ్వబోతున్నట్లు మంత్రి పార్థసారథి ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.