Andhra: ఎంత తాగావ్‌రా.. సోయి ఉండక్కర్లా..?

Andhra: ఎంత తాగావ్‌రా.. సోయి ఉండక్కర్లా..?


రోడ్డుపై వెళ్తుంటే జామ చెట్టో, మామిడి చెట్టో కాయలతో నిండుగా కనిపిస్తే కొందరు ఒక కాయ కోసుకుని తింటారు. తెలిసిన వాళ్లయితే మరికొన్ని అడిగి తీసుకుంటారు. కానీ అదే పాలిచ్చే ఆవు లేదా గేదె ఎదురైతే.. మనకు పాలు కావాలనే కారణంతో రోడ్డు మధ్యే వాటి పొదుగును పితికి పాలు తాగగలమా? అలాంటి ఘటనే వెలుగుచూసింది పశ్చిమ గోదావరి జిల్లాలో. ఓ ప్రబుద్ధుడు ఇదే చేశాడు. ఆకలి వేసిందన్న కారణంతో నడిరోడ్డుపై ఆవు పొదుగును పితికి పాలు తాగాడు. రోడ్డుపై నిలబడి ఉన్న ఆవు కాళ్ల దగ్గరే కూర్చుని పాలు తాగుతున్న అతడిని మొదట స్థానికులు గమనించలేదు. ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి కొందరు అతడిని వారించారు. మద్యం మత్తులో ఉన్న అతడి చేష్టలను చూసి ఆ రోడ్డుపై వెళ్లే వారు నిశ్చేష్టులయ్యారు. ఆవు మాత్రం తల్లి మనసుతో.. ఏం అనకుండా తన పాలు ఇచ్చింది.

కానీ మనిషి అన్నాక కనీస ఇంగితం, సంస్కారం ఉండాలి కదా! ఆకలితో ఉన్న ఆవుకు గుప్పెడు గడ్డి కూడా వేయని వ్యక్తి, చెట్టంత పెరిగి రోడ్డుపై ఆవు పొదుగును చీకడం పలువురిలో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. మళ్లీ అటువైపు కనిపిస్తే తాట తీస్తామని హెచ్చరించడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. మనుషుల్లో కొందరు రోజు రోజుకు ఎలా దిగజారుతున్నారో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి దృశ్యాలు మీ కంటపడితే మీకేమనిపిస్తుంది? కోపం వస్తుందా, అసహ్యం వేస్తుందా? ఆవు మాత్రం సాధుజీవి.. ఆ వ్యక్తి చేష్టలను ఏమాత్రం పట్టించుకోనట్టే నిల్చుంది.

వీడియో దిగువన చూడండి…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *