Andhra: ఆటో.. అటో.. ఇటో.. నడిరోడ్డుపై విన్యాసాలు.. కట్‌చేస్తే.. ఏం జరిగిందో తెలుసా..?

Andhra: ఆటో.. అటో.. ఇటో.. నడిరోడ్డుపై విన్యాసాలు.. కట్‌చేస్తే.. ఏం జరిగిందో తెలుసా..?


హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి 44పై కర్నూలు శివారులో ఆటోలతో విన్యాసం చేసిన దృశ్యాలు అందరిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సమాచారం తెలుసుకున్న కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ట్రాఫిక్ పోలీసులను అలర్ట్ చేశారు. వీటిని చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. వెంటనే చర్యలు ప్రారంభించారు. కర్నూలు మమతా నగర్ కు చెందిన శివ మల్లేష్, అఖిల్, అశోక్ నగర్ లోని శ్రీకృష్ణ కాలనీకి చెందిన ఘనమురు జయసింహాలను అదుపులోకి తీసుకున్నారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించారు.

Auto Driver Arrest

Auto Driver Arrest in Kurnool

అసలేం జరిగిందంటే.. ఈనెల 1వ తేదీ రాత్రి పదిన్నర గంటల సమయంలో ముగ్గురు కలిసి పంచలింగాల సర్కిల్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదకరంగా ఆటోలు నడుపుతూ ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురి చేశారు. రోడ్డు మీద ఒక టైర్ తగలకుండా డ్రైవింగ్ చేస్తున్న దృశ్యాలు నిజంగా ఆందోళనకు గురిచేశాయి. స్థానికుల ఫిర్యాదుతో బుధవారం వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి ఆటోలను రవాణా శాఖకు అప్పగించారు.

వీడియో చూడండి..

ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు పోలీసులు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ సరదా కోసం రోడ్లపై వాహనాలతో విన్యాసాలు చేస్తే జైలు శిక్షతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *