అనసూయ భరద్వాజ్.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రాంరంభించి ఆతర్వాత యాంకర్‌గా మారింది ఈ అమ్మడు. యాంకర్‌గా ఎన్నో టీవీషోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ టీవీ షో జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక సినిమాల్లో నటిస్తూ అలరిస్తుంది. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఇక ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. పెళ్ళై ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ అందంలో కుర్రహీరోయిన్స్ తో పోటీపడుతోంది ఈ ముద్దుగుమ్మ.
ఇక సినిమాలు, టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. రెగ్యులర్ గా తన సినిమా సినిమా అప్డేట్స్ తో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను, ఫోటోలను కూడా పంచుకుంటుంది. అలాగే తనపై నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేసేవారి పై కూడా ఫైర్ అవుతుంటుంది అనసూయ. తాజాగా అనసూయ ఓ షాపింగ్ మాల్ ఓపినింగ్ కు వెళ్ళింది. షాపింగ్ మాల్ ఓపినింగ్ తర్వాత అభిమానులతో మాట్లాడింది.
ఇవి కూడా చదవండి
ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు అసభ్యకర కామెంట్స్ చేశారు. దాంతో అనసూయకు పట్టరాని కోపం వచ్చింది. దాంతో సహనం కోల్పోయిన అనసూయ చెప్పు తెగుద్ది.. అంటూ సీరియస్ అయ్యింది. మీ ఇంట్లో ఆడవాళ్లను ఇలానే కామెంట్స్ చేస్తారా.? మీ ఇంట్లో మీ అమ్మ, చెల్లి, భార్యను ఇలా కామెంట్స్ చేస్తే ఊరుకుంటారా అంటూ సీరియల్ అయ్యింది. మీరు చిన్న పిల్లలు మీ ఇంట్లో మీకు ఇదే నేర్పించారా.?ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
అసభ్య కామెంట్లు చేస్తే చెప్పు తెగుద్ది
:- #Anasuya pic.twitter.com/nQZHOUScXR
— Milagro Movies (@MilagroMovies) August 2, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.