ఇండస్ట్రీలో రాణిస్తున్న తెలుగమ్మాయిల్లో ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యకంగా చెప్పుకోవాలి.. నటిగా ఒకొక్క మెట్టు ఎక్కుతూ వస్తుంది అందాల భామ అనన్య నాగళ్ల. సినిమాలపై ఇంట్రెస్ట్ తో సాఫ్ట్ వేర్ జాబ్ మానేసింది అందాల భామ అనన్య నాగళ్ల. షార్ట్ ఫిల్మ్స్ తో మరో కొత్త జీవితం ప్రారంభించింది.
ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ అనతికాలంలోనే తెలుగు నాట క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే, మరోవైపు సహాయనటిగా ఇతర హీరోయిన్స్ చిత్రాల్లోనూ మెప్పిస్తోందీ ఈ చిన్నది.
తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆతర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత అనన్య క్రేజ్ పెరిగిపోయింది.
దాంతో అనన్యకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో యమా బిజీగా మారిపోయింది. అయితే అనన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోవడం లేదు.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అనన్య తన బర్త్ డే ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.