Amla Juice or Turmeric Water: ఉరిసి జ్యూస్ లేదా పసుపు నీరు.. అందమైన చర్మం కోసం ఏది బెస్ట్!

Amla Juice or Turmeric Water: ఉరిసి జ్యూస్ లేదా పసుపు నీరు.. అందమైన చర్మం కోసం ఏది బెస్ట్!


ఉసిరి, పసుపు ఈ రెండు ఆయుర్వేదంలో ఎంతో ప్రసిద్ధి చెందినవి. వీటిని అనేక ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారు. ఇవి మన పూర్తి ఆరోగ్యంతో పాటు చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే వీటిని కొందరు రసంగా చేసి తాగేందుకు ఇష్టపడుతారు. ఇలా చేయడం ద్వారా చర్మ సమస్యలను దూరం చేసుకుంటారు. అయితే మెరిసే అందమైన చర్మం కోసం వీటిని ఏ సమయంతో తీసుకోవడం ఉత్తమం అనే విషయంలో చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయి. కాబట్టి చర్మ సౌందర్యం కోసం ఏది ఉత్తమమైనదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరి జ్యూస్ యొక్క ప్రయోజనాలు

ఉసిరి విటమిన్ సికి అద్భుతమైన మూలం. చర్మ స్థితిస్థాపకతను కాపాడే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి దీనికి మించిన మార్గం మరొకటి లేదు. ఉసిరిని తినడం వల్ల అకాల వృద్ధాప్యాన్ని నివారించడంతో పాటు చర్మంపై ముడతలను తగ్గించడంలో, సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించడంతో సహాచపడుతాయి. అలాగే చర్మానికి సహజమైన మెరుపును అందించడంలో ఉసిరి ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు చిన్న వయస్సులోనే చర్మంపై ముడతలు వచ్చినా, లేద మీ చర్మం నిస్తేజంగా మారిని మీకు ఉసిరి జ్యూస్ ఎంతో అద్బుతంగా పనిచేస్తుంది.

పసుపు నీటి ప్రయోజనాలు

పసుపులో లభించే కర్కుమిన్ చర్మ ఇన్ఫెక్షన్లు, మంటను నివారించడంలో సహాయపడుతుంది. పసుపు వల్ల మొటిమలు, చర్మంపై నల్లటి మచ్చలు తొలగిపోతాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా చర్మపు రంగును పెంచుతుంది. జిడ్డుగల చర్మం, దీర్ఘకాలిక మొటిమలు, మచ్చలు ఉన్నవారికి, పసుపు కంటే మెరుగైన పరిష్కారం మరొకటి లేదు. ఇది అకాల చర్మ సమస్యలను తొలగించడంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఉదయం పూట ఏది మంచిది?

మనం నిద్ర లేచిన తర్వాత ముందుగా తాగాల్సినది ఒక గ్లాసు నీరు. ఇది జీర్ణక్రియకు, శరీరంలో తగినంత హైడ్రేషన్‌కు, జీవక్రియకు సహాయపడుతుంది. అందువల్ల, ఉదయం వెచ్చని సహజ పానీయాలు తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో ఉసిరికాయ రసం, పసుపు నీరు ఉన్నాయి. ఈ రెండింటి ప్రయోజనాలను శరీరానికి పొందడానికి, ఒక గ్లాసు ఉసిరి రసంలో చిటికెడు పసుపు పొడి, అల్లం వేసి గోరువెచ్చగా త్రాగాలి, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మానికి రెట్టింపు మెరుపును ఇవ్వడానికి సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *