
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఫోన్లు సహా వివిధ ఉత్పత్తులపై బంపర్ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇక ల్యాప్‌టాప్‌లు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. లెనోవా, ఏసర్, డెల్ వంటి అనేక పెద్ద బ్రాండ్‌ల ల్యాప్‌టాప్‌లను ఈ సేల్‌లో చాలా తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. కానీ మీరు సేల్ సమయంలో షాపింగ్ చేసేటప్పుడు అదనపు డిస్కౌంట్ లభించాలంటే..ఎక్స్‌ఛేంజ్ లేదా బ్యాంక్ కార్డులను ఉపయోగించాలి. అమెజాన్ సేల్‌లో మీరు ఎస్బీఐ బ్యాంక్ కార్డ్‌తో చెల్లిస్తే.. మీకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.
డెల్ ఇన్‌స్పైరాన్ 3535..
16జీబీ RAM, 15.6 ఇంచెస్ డిస్‌ప్లేతో వచ్చే ఈ ల్యాప్‌టాప్‌పై 17 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. 512జీబీ SSD స్టోరేజ్‌తో అమెజాన్ సేల్‌లో రూ.39,990కి అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ ఫీచర్ల గురించి చెప్పాలంటే.. 120 Hz రిఫ్రెష్ రేట్, విండోస్ 11, ఏఎమ్ డీRyzen 5-7530U ప్రాసెసర్‌తో వస్తుంది.
లెనోవా స్మార్ట్‌ఛాయిస్ ఐడల్‌ప్యాడ్ స్లిమ్ 3
ఈ లెనోవా ల్యాప్‌టాప్‌ను సేల్‌లో 31 శాతం తగ్గింపుతో మీ సొంతం చేసుకోవచ్చు. రూ. 61,990కే ఇది అందుబాటులో ఉంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్, 16జీబీ RAM, 512జీబీ SSD స్టోరేజ్, విండోస్ 11, బ్యాక్‌లిట్ కీబోర్డ్‌తో వస్తుంది.
ఏసర్ ఆస్పైర్ లైట్..
ఈ ఏసర్ ల్యాప్‌టాప్ 512జీబీ SSD స్టోరేజ్, 8జీబీ RAM, 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ డిస్‌ప్లే, విండోస్ 11 హోమ్, ఏఎమ్‌డీ Ryzen 3 7330U ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ సేల్‌లో ఈ ల్యాప్‌టాప్‌పై 44 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్ తర్వాత రూ. 26,990కే అందుబాటులో ఉంది.
జియో బుక్ 11..
జియో బ్రాండ్ యొక్క అత్యంత సరసమైన ల్యాప్‌టాప్ కూడా 52శాతం తగ్గింపు తర్వాత రూ. 11,999కే వస్తుంది. ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే.. ఈ ఆండ్రాయిడ్ 4జీ ల్యాప్‌టాప్ మీడియాటెక్ 8788 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబీ RAM, 64జీబీ స్టోరేజ్, డ్యూయల్ బ్యాండ్ వైఫై వంటి ఫీచర్లతో వస్తుంది.
మీరు ల్యాప్‌టాప్ కొనాలని చూస్తూ ఉంటే ఈ సేల్‌లో తక్కువ ధరకే మీ సొంతం చేసుకోండి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..