Amazon: అమెజాన్‌లో క్రెడిట్ కార్డులపై బంపర్ ఆఫర్లు.. లింక్ చేసుకోవడం చాలా ఈజీ

Amazon: అమెజాన్‌లో క్రెడిట్ కార్డులపై బంపర్ ఆఫర్లు.. లింక్ చేసుకోవడం చాలా ఈజీ


Amazon: అమెజాన్‌లో క్రెడిట్ కార్డులపై బంపర్ ఆఫర్లు.. లింక్ చేసుకోవడం చాలా ఈజీ

దేశంలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడంతో ఎక్కువ మంది రోజువారీ అవసరాల కోసం ఆన్‌లైన్ షాపింగ్ నుంచి యుటిలిటీ బిల్లు చెల్లింపుల వరకు  డిజిటల్ లావాదేవీల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో క్రెడిట్ కార్డులు చాలా మందికి ప్రాధాన్యత ఉన్న చెల్లింపు సాధనంగా మారాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల ఖర్చుపై గిఫ్ట్స్, ఈఎంఐ ఎంపికలు, సురక్షిత చెల్లింపులు, ప్లాట్‌ఫారమ్‌లలో ఇబ్బంది లేని లావాదేవీల కారణంగా క్రెడిట్ కార్డుల చెల్లింపులు పెరిగాయి. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై భారీ డిస్కౌంట్లు, జీరో ఈఎంఐ ఎంపికలతో పాటు అగ్ర బ్రాండ్లపై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తుంది. అయితే వీటి కోసం ముందుగా మీరు మీ క్రెడిట్ కార్డును మీ అమెజాన్ ఖాతాకు లింక్ చేసుకోవాలి.

అమెజాన్ యాప్‌కు క్రెడిట్ కార్డు లింక్ ఇలా

  • అమెజాన్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసి ఆపై మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడీ లేదా ఫోన్ నంబర్‌ను ఉపయోగించి మీ ప్రస్తుత ఖాతాలోకి లాగిన్ అవ్వాలి.
  • మీరు కొత్త యూజర్ అయితే ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) నమోదు చేయాల్సి ఉంటుంది.
  • ఎడమ వైపున ఉన్న మెనూను ఎంచుకుని మై అకౌంట్‌లోకి వెళ్లాలి. 
  • ‘అమెజాన్ పే’ విభాగం కింద ‘చెల్లింపు ఎంపికలను నిర్వహించు’పై నొక్కాలి
  • ‘చెల్లింపు పద్ధతిని జోడించు’ ఎంచుకోవాలి. ఆపై ‘క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ను జోడించు’ ఎంచుకోవాలి.
  • మీ కార్డు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. మీ కార్డ్ నంబర్, గడువు తేదీ, 
  • సీవీవీ, కార్డ్ హోల్డర్ పేరు నమోదు చేయాల్సి ఉంటుంది. 
  • సమాచారాన్ని సేవ్ చేయడానికి ‘మీ కార్డ్‌ని జోడించు’ ఎంచుకోవలాి. 
  • మీ బ్యాంక్ పంపిన ఓటీపీను ఉపయోగించి ధ్రువీకరణను పూర్తి చేయాలి. అప్పుడు మీ కార్డ్ మీ అమెజాన్ ఖాతాకు సురక్షితంగా యాడ్ అవుతుంది. 
  • ఇలా యాడ్ చేయడం వల్ల ప్రతి లావాదేవీకి మీ క్రెడిట్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయకుండా ఉండటానికి ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం మీ కార్డ్ వివరాలను సేవ్ చేసే ఎంపికను కూడా మీరు ఎంచుకోవచ్చు.

అమెజాన్ ఎన్క్రిప్షన్ ఆధారిత వ్యవస్థలు, పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్ సమ్మతితో సురక్షిత చెల్లింపులను నిర్ధారిస్తుంది. వినియోగదారులు సురక్షితమైన నెట్‌వర్క్‌ల ద్వారా మాత్రమే కార్డులను జోడించాలని, ఓటీపీలు లేదా సీవీవీలు వంటి సున్నితమైన వివరాలను ఎప్పుడూ పంచుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఈ యాప్ ద్వారా మల్టీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను నిల్వ చేయడానికి అనుమతిస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *