పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. పుష్ప 1, 2 చిత్రాలతో వరల్డ్ వైడ్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ హీరో ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ బన్నీతో షూటింగ్ చేయడం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆయనతో యాడ్ షూట్ చేయాలంటే పలు నిబంధనలు ఉంటాయని చెప్పుకొచ్చింది. తాజాగా ఈ కామెంట్స్ పై అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ఆమె చేసిన వ్యాఖ్యలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది.
ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.
“అల్లు అర్జున్ గురించి ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న ఒక వీడియోలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. అసత్యమైనవి. ఈ విధమైన తప్పుడు ప్రచారాన్ని మేము అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాము. బాధ్యులపై చట్టపరమైన చర్యం తీసుకుంటాం. ” అంటూ నోట్ విడుదల చేసింది అల్లు అర్జున్ టీమ్.
ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..
విషయానికి వస్తే.. ఇటీవల కావేరి బారువా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”ఒక్కొక్కరికి ఒక్కో విధమైన వ్యక్తిత్వం ఉంటుంది. అల్లు అర్జున్ తో యాడ్ సందర్భంగా రకమైన అనుభవం నేను ఎదుర్కొన్నాను. దక్షిణాది హీరోలతో షూట్ చేయాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. ఎం చేయాలి… ఏం చేయకూడదు అని 42 నిబంధనలు ఉంటాయి. ఈ విషయంలో మేనేజర్లు చాలా కఠినంగా ఉంటారు. హీరోకు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దు.. తగిన దూరం పాటించాలి ” అని చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె కామెంట్స్ పై అల్లు అర్జున్ టీమ్ స్పందించింది.
ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..