నటనపై ఆసక్తితో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టి తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే తమ ప్రతిభతో ప్రేక్షకులను మెప్పించి.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న స్టార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు సైతం అదే జాబితాలోకి చెందినవారు. పైన ఫోటోను చూశారు కదా.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అటు హీరోగానే కాకుండా ఇటు విలన్ పాత్రలతోనూ ఇరగదీస్తున్నాడు. అతడికి భాషతో సంబంధం లేకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు, హిందీ, తమిళం భాషలలో తనదైన ముద్ర వేశాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా..? అతడు మరెవరో కాదండి.. అభిమానులు ఎంతో ముద్దుగా మక్కల్ సెల్వన్ అని పిలుచుకునే హీరో విజయ్ సేతుపతి.
ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?
దుబాయ్ లో వర్క్ చేసుకునే ఓ సాధారణ కుర్రాడు నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. కెరీర్ మొదట్లో ధనుష్ వంటి స్టార్ హీరో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. ఆ తర్వాత హీరోగా చిన్న సినిమాలు చేశాడు. నెమ్మదిగా వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు.1996లో వచ్చిన లవ్ బర్డ్స్ మూవీతో సినీరంగ ప్రవేశం చేశాడు. దాదాపు పదేళ్లు చిన్న పాత్రలు పోషించిన అతడు.. చివరకు తెన్‌మెర్కు పరువకాట్రు హీరోగా మారాడు. 2012లో పిజ్జా సినిమా హీరోగా విజయ్ సేతుపతికి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత అతడు వెనుదిరిగి చూడలేదు.
ఇవి కూడా చదవండి: Tollywood: ఉదయం లేవగానే ముఖానికి ఉమ్మీ రాసుకుంటాను.. స్టార్ హీరోయిన్ బ్యూటీ సీక్రెట్.. ఫ్యాన్స్ షాక్..
ఆ తర్వాత తెలుగు, తమిళం భాషలలో వరుస అవకాశాలు అందుకున్నాడు. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఇందులో రాయనం అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించి మెప్పించారు. ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, కమల్ హాసన్ విక్రమ్ సినిమాల్లో విలన్ పాత్రలలో అదరగొట్టాడు. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ ఇప్పుడు బిజీగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి: Pawan Kalyan: ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి: Mahesh Babu : కాలేజీలో మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్..