అప్పటి తెలుగు హీరోయిన్ ప్రత్యూష గురించి అందరికీ తెలుసు. వర్ధమాన తారగా ఒక వెలుగు వెలిగిన ప్రత్యూష కొద్ది రోజులకి హత్యకు గురైంది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రం సంచలనంగా మారిన ఈ కేసులో పోలీసు విచారణ పై అనేక అభ్యంతరాలు, ఆరోపణలు వెలువెత్తాయి. ఈ కేసులో అప్పటి ప్రభుత్వంలో ఉన్న మంత్రుల కుమారుల హస్తం ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది.
2002లో ఈ హత్య జరగగా సుదీర్ఘకాలం పాటు ఈ కేసును విచారించిన సిబిఐ తాజాగా ఈ కేసులో చార్జీ షీట్ దాఖలు చేసింది. ఇందులో ప్రత్యూష స్నేహితుడు సిద్ధార్థ రెడ్డిని సీబీఐ నిందితుడిగా పేర్కొంది. దీంతో కేసుపై విచారణ జరిపిన నాంపల్లి స్టేషన్ కోర్టు సిద్ధార్థ రెడ్డికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే ప్రత్యూష కుటుంబం మాత్రం ఈ నేరానికి కేవలం ఏడేళ్ల జైలు శిక్ష సరిపోదు అంటూ హైకోర్టును ఆశ్రయించింది.
ప్రత్యూషను క్రూరంగా అత్యాచారం చేసి హత్య చేశారని ఆమె తల్లి ఆరోపించింది. ఈ నేరానికి జీవితకాల శిక్ష విధించాలని 2006లో హైకోర్టును ఆశ్రయించింది. 2011 వరకు ఐదేళ్ల పాటు ఈ కేసును విచారించిన హైకోర్టు సిద్ధార్థ రెడ్డికి వ్యక్తిరేకంగా బలమైన సాక్షాధరాలు లేవని జైలు శిక్షను రెండున్నర ఏళ్లకు తగ్గించింది.
దీంతో 2011లో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రత్యూష కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు దీనిపై విచారణ జరపడం ప్రారంభించింది. అప్పటి నుంచి సుమారు14 ఏళ్లపాటు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు మంగళవారం ఈ కేసులో తుది తీర్పు రానుంది. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న సిద్ధార్థ రెడ్డికి శిక్ష పెంచుతారా? లేదా హైకోర్టు జడ్జిమెంట్‌తో ఏకీభవించి అతని శిక్షణు తగ్గిస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.