Actress Meena : ఒంటరిదాన్ని అనే కదా ఇంత బాధపెడుతున్నారు.. కర్మ వదిలిపెట్టదు.. హీరోయిన్ మీనా..

Actress Meena : ఒంటరిదాన్ని అనే కదా ఇంత బాధపెడుతున్నారు.. కర్మ వదిలిపెట్టదు.. హీరోయిన్ మీనా..


చైల్డ్ ఆర్టిస్టు నుంచి కథానాయికగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది హీరోయిన్ మీనా. ఇప్పటికీ వైవిధ్యమైన పాత్రలతో ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది. అయితే సినీప్రయాణంలో సక్సెస్ అయినప్పటికీ తన పర్సనల్ విషయాలు మాత్రం నిత్యం నెట్టింట ప్రచారం జరుగుతుంటాయి. ముఖ్యంగా తన భర్త మరణం తర్వాత మీనాకు రెండో పెళ్లి అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన రూమర్స్ చక్కర్లు కొడుతుంటాయి. ఇప్పటికే ఈ రూమర్స్ పై స్పందించిన మీనా ఆగ్రహం వ్యక్తం చేసింది. దయచేసి ఇటువంటి రూమర్స్ వ్యాప్తి చేయకండి అని మీనా కోరడంతో కొంతకాలం ఆ గాసిప్స్ పత్తా లేకుండా పోయాయి. ఆ తర్వాత మళ్లీ అదే రూమర్స్ వినిపించాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

తాజాగా మరోసారి తన గురించి వస్తున్న రూమర్స్ పై సీరియస్ అయ్యింది. తనకు రెండో పెళ్లి అని చెత్తంతా రాస్తున్నారని.. అందులో నిజం ఉంటే మీరు మాట్లాడుకోవడంలో తప్పు లేదని.. కానీ ఏదేదో ఊహించుకుని.. కల్పించుకుని రాయడం ముమ్మాటికీ తప్పే అని అన్నారు. తాను ఒక ఒంటరి మహిళను అందులోనూ సెలబ్రెటీని అనే కదా అని మీకు నచ్చినట్లు రూమర్స్ సృష్టిస్తున్నారని.. తన సహనాన్ని పరీక్షిస్తున్నారని అన్నారు. తన కూతురు ఇవన్నీ చూస్తే ఏమనుకుంటుందని… ఈ రూమర్స్ తనకు ఎంతో అసౌకర్యంగా ఉందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

ప్రస్తుతం తన గురించి వస్తున్న రూమర్స్ చాలా చిరాకు తెప్పిస్తుందని.. వీటిని భరించడం తన వల్ల కావడం లేదని.. కానీ కర్మ అనేది ఒకటుందని.. అదెవర్నీ వదిలిపెట్టదని.. ఈ అనవసర ప్రచారం పై స్పందించి సమయం, ఎనర్జీ, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోదల్చుకోలేనని… ఎప్పుడూ పాజిటివ్ గా ఉండటానికే ప్రయత్నిస్తానని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *