Actress Divi: నడుము గిల్లితే వెంటనే బాడకోవ్ అని తిట్టి.. ఒక్కటిచ్చా..

Actress Divi: నడుము గిల్లితే వెంటనే బాడకోవ్ అని తిట్టి.. ఒక్కటిచ్చా..


Actress Divi: నడుము గిల్లితే వెంటనే బాడకోవ్ అని తిట్టి.. ఒక్కటిచ్చా..

నటి దివి ఒక ఇంటర్వ్యూలో తనకు పబ్‌లో ఎదురైన ఒక చెడు సంఘటనను, అలాగే దుస్తుల ఎంపిక, వ్యక్తిగత గోప్యత వంటి అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ, సమాజంలో మహిళల పట్ల అవగాహన గురించి లోతైన చర్చను ప్రారంభించారు. ఇటీవల జరిగిన ఒక పబ్ ఈవెంట్‌కు అతిథిగా వెళ్లినప్పుడు ఎదురైన సంఘటనను దివి వివరించారు. చుట్టూ బాడీగార్డులు ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి తనను నడుము గిల్లాడని ఆమె తెలిపారు. ఈ సంఘటన జరిగిన వెంటనే, ఆమె వెనక్కి తగ్గకుండా ఆ వ్యక్తిని కొట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ చర్య పట్ల తనకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదని, ఒకవేళ అలా స్పందించకపోతే తాను బాధపడేదాన్నని దివి పేర్కొన్నారు. తన చుట్టూ భద్రత ఉన్నప్పటికీ ఈ సంఘటన జరిగిందని, తన దుస్తుల వల్ల ఇది జరగలేదని ఆమె నొక్కి చెప్పారు. అప్పుడు తాను సౌకర్యవంతమైన టీషర్టు ధరించి ఉన్నానని ఆమె తెలిపారు.

దుస్తుల ఎంపికపై ఆమె తన అభిప్రాయాలను సూటిగా చెప్పారు. ఒకరు ధరించే దుస్తులు సౌకర్యవంతంగా ఉండాలని, అది వ్యక్తిగత ఎంపిక అని ఆమె అన్నారు. ఏదైనా సందర్భానికి తగినట్లుగా దుస్తులు ధరించడం ఉత్తమమని, అందరూ ఉన్న చోట అగ్లీగా లేదా వల్గర్‍‌గా కనిపించకూడదని ఆమె సూచించారు. ముఖ్యంగా, ఒకరు తన దుస్తులతో అసౌకర్యంగా ఉంటే, ఆ దుస్తులు ధరించాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. “నువ్వు సౌకర్యంగా లేకపోతే, దానిని ఎందుకు ధరిస్తావు? నీకు సౌకర్యంగా ఉంటేనే ధరించు. లేదంటే వద్దు” అంటూ తన అభిప్రాయాన్ని నిక్కచ్చగా చెప్పారు. సమాజంలో మహిళల దుస్తులపై ఉండే ధోరణిని కూడా దివ్య పిళ్ళై చర్చించారు. కొందరు మగవాళ్లు “ట్రిగ్గర్” అవుతారని అనడాన్ని ఆమె తప్పుపట్టారు. ఇతరులు ధరించే దుస్తులు చూసి అసౌకర్యంగా భావించేవారు.. చూడొద్దని స్పష్టం చేశారు. ఇతరుల ఎంపిక పట్ల మనం అసౌకర్యంగా ఉంటే, అది మన సమస్యే తప్ప వారిది కాదని ఆమె అన్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ అన్న మాటలను వివరిస్తూ..  చిన్నప్పటి నుంచి పిల్లలకు సరైన విద్య, అవగాహన కల్పించాలని, బయటి ప్రపంచాన్ని దాచిపెట్టకుండా వాస్తవాలను తెలియజేయాలని ఆమె సూచించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *