Actress : 300 కోట్లు కొల్లగొట్టిన హీరోయిన్.. రోడ్డుపై పెనం పెట్టి దోసెలు వేసింది.. నెటిజన్స్ రియాక్షన్ చూస్తే..

Actress : 300 కోట్లు కొల్లగొట్టిన హీరోయిన్.. రోడ్డుపై పెనం పెట్టి దోసెలు వేసింది.. నెటిజన్స్ రియాక్షన్ చూస్తే..


కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో అవకాశాల కోసం ప్రయత్నించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. విభిన్నమైన కంటెంట్.. వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. అయితే గతేడాది ప్రారంభంలోనే తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె మరోవరో కాదు.. హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్. 2025లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీ అవుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ రాలేదు. ప్రస్తుతం తెలుగులో ఓ సుకుమారి చిత్రంలో నటిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

అలాగే తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. ఇవే కాకుండా ఇప్పుడిప్పుడే కన్నడలోనూ అవకాశాలు అందుకుంటుంది. తాజాగా తను ఒక మూవీ సెట్ లో చెఫ్ గా మారింది. అక్కడ ఉన్నవారికి స్వయంగా ఊతప్పం వేసి వడ్డించింది. చీరకట్టులో సింపుల్ లుక్స్ లో హుషారుగా ఊతప్పాలు వేసి వడ్డిస్తూ సరదాగా గడిపింది. తనకు సెట్ లో ఈ పని చేయడమంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

ఐశ్వర్య రాజేశ్ దోశ వీడియో వైరలవుతుండగా.. కీర్తి సురేశ్ రిప్లై ఇస్తూ హే.. దోసే అంటూ కామెంట్ చేసింది. అందుకు ఐశ్వర్య రాజేశ్ రియాక్ట్ అవుతూ.. అవును..నీ ఫేవరెట్ అంటూ రిప్లై ఇచ్చింది.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

View this post on Instagram

A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh)

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *