సినిమా గ్లామర్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్స్ ఎక్కువ కాలం కొనసాగలేరు. ముఖ్యంగా పెళ్లి తర్వాత తారలకు లీడ్ రోల్స్ రావడం కష్టమే. హీరోహీరోయిన్లకు తల్లిగా, అత్తగా, వదిన పాత్రలు పోషిస్తుంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం చరిత్ర తిరగరాసింది. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో అగ్ర కథానాయికగా దూసుకుపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హాలీవుడ్ ఇండస్ట్రీ వరకు తనదైన ముద్ర వేసింది. ఆమె 16 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీ విడుదలకు ముందే తోటి నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 17 ఏళ్ల వయసులోనే మొదటి కుమార్తెకు జన్మనిచ్చింది. కొన్ని సంవత్సరాలకు మరో కూతురికి జన్మనిచ్చింది. కానీ 25 ఏళ్ల వయసులోనే విడాకులు తీసుకుంది. ఆమె ఎవరో తెలుసా.. హీరోయిన్ డింపుల్ కపాడియా.
ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..
ఆమె తొలి చిత్రం బాబీ. 1973లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఫస్ట్ మూవీతోనే కట్టిపడేసింది. ఈ మూవీతో రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది. ఆమె తొలి చిత్రం విడుదలకు ముందే సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాను వివాహం చేసుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోయింది. కానీ కొన్నేళ్లకే తన భర్తతో విడిపోయింది. విడాకులు తీసుకునే సమయానికి ఆమె వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే.
ఇవి కూడా చదవండి

సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ..

అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్..

రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం..

అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్తోనే..
ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?
కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న డింపుల్ కపాడియా.. 1985 తిరిగి నటనలోకి వచ్చి సాగర్ చిత్రంలో కనిపించింది. ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె రుడాలి (1993) వంటి అనేక సూపర్‌హిట్‌లలో నటించింది. 2006 హాలీవుడ్ చిత్రం లీలాలో కూడా నటించింది.
ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..

Dimple Kapadia Movies
ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..