టాలీవుడ్ ఇండస్ట్రీలో ముమైత్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించింది. డ్యాన్సర్ గా సినీరంగంలో చక్రం తప్పింది. కొన్నేళ్లపాటు వరుస సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ వెండితెరపై సందడి చేసింది. అప్పట్లో ఆమె చేసిన పాటలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ముమైత్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ ప్రమాదం కారణంగా ఏడేళ్లపాటు మంచానికే పరిమితమైనట్లు తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..
సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి పరిశ్రమలో కనిపించడంపై మాట్లాడుతూ, తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలను వివరించారు. ఒక ప్రమాదంలో జారిపడి, మూడు నరాలు తెగిపోయాయని ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిందని తెలిపారు. ఈ సంఘటన కారణంగా 15 రోజుల పాటు కోమాలో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. దాదాపు ఏడేళ్ల పాటు మంచానికి పరిమితమయ్యాయని.. ఈ క్లిష్టమైన సమయాన్ని దాటి తిరిగి రావడానికి ఆమె చాలా కష్టపడ్డానని అన్నారు. తొందరగా కోలుకోవడానికి మందులు వాడడంతో లావు అయ్యానని.. విరామం తీసుకోవడానికి దేవుడు ఇలా చేశాడని అనుకున్నానని.. అంతేకాని బాధ పడలేదని అన్నారు. ఆ సమయంలో తన తల్లి కంటికి రెప్పలా చూసుకుందని చెప్పుకొచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..
తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ.. వాళ్లిద్దరిది అరేంజ్ మ్యారేజ్ అని చెప్పారు. తన తల్లి తమిలియన్ ముస్లిం రౌతర్ అని, తండ్రి పాకిస్తాన్‌లోని స్వాత్ ప్రాంతం నుండి వచ్చారని తెలిపారు. జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత, అనురాధ, డిస్కో శాంతి వంటి ఇతర స్పెషల్ సాంగ్ తారల గురించి చెప్పుకొచ్చారు.
Mumaith Khan News
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..