తెలుగులో ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచేసింది. అందం, అభినయంతో సిల్వర్ స్క్రీన్ పై మాయ చేసింది. అప్పట్లో ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. 17 ఏళ్లకే సౌత్ ఇండస్ట్రీతోపాటు నార్త్ లోనూ వరుస అవకాశాలు అందుకుంటూ గుర్తింపు తెచ్చుకుంది. చిన్న వయసులోనే తండ్రి మరణంతో కుటుంబానికి అండగా ఉండాలనుకుంది. దీంతో అప్పుడే రిసెప్షనిస్టుగా పనిచేసింది. ఆ తర్వాత నెమ్మదిగా బుల్లితెరపైకి అడుగుపెట్టిన ఆమె.. బుల్లితెరపై పలు సీరియల్స్ చేసింది. ఆ తర్వాత ఒక్క సీరియల్ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. చాలా కాలం తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ అనితా హస్సానందిని.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..
అనితా హస్సానందిని.. తెలుగు సినీప్రియులకు సుపరిచితమైన పేరు. 1981 ఏప్రిల్ 14న ముంబైలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. 15 ఏళ్లకే తండ్రి చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు రిసెప్షనిస్ట్ గా పనిచేసింది. ఆ తర్వాత 17 ఏళ్ల వయసులో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇధర్ ఉధర్ అనే సీరియల్ ద్వారా హిందీ సినిమా ప్రపంచంలో పాపులర్ అయ్యింది. ఈ సీరియల్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ త్రవాత కావ్యాంజలి సీరియల్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సీరియల్ తర్వాత బుల్లితెరపై వరుసగా అవకాశాలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి : Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?
ఇక 1999లో వచ్చిన తాళ్ సినిమాలో ఐశ్వర్య రాయ్ తో కలిసి నటించింది. 2001లో తేజ తెరకెక్కించిన నువ్వు నేను సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఇందులో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ మూవీ తర్వాత తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తొట్టి గ్యాంగ్, మనలో ఒకడు, శ్రీరామ్, నిన్నే ఇష్టపడ్డాను, నేను పెళ్లికి రెడీ, నేనున్నాను, కృష్ణా కాటేజ్ వంటి చిత్రాల్లో నటించింది. వెంకటేశ్ నటించిన మల్లీశ్వరి సినిమాలో గెస్ట్ రోల్ పోషించింది. అయితే నువ్వు నేను తర్వాత అనితా నటించిన చిత్రాలన్ని డిజాస్టర్స్ అయ్యాయి.దీంతో పూర్తిగా బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..
అక్కడ కూడా అవకాశాలు తగ్గిపోవడంతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఆ తర్వాత నాగిని సీరియల్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. హిందీలో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న అనితా.. ఇటీవలే సుహాస్ నటించిన ఓ భామా అయ్యో రామా సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?
ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..