అందంలో అప్సరస ఈ అమ్మడు. తెలుగు, తమిళం, మలయాళంలో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఊహించని ఘటనతో ఆమె కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. సినిమాలకు దూరంగా ఉండిపోయిన ఈ హీరోయిన్ ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది.
ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ భావన మీనన్. మహాత్మా సినిమాతో తెలుగులో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఓ స్టార్ హీరో ఆమెపై పగ పట్టాడు. తన మనుషులతో కిడ్నాప్ చేయించి లైంగిక వేధింపులకు పాల్పడేలా చేశాడు. ఆ ఘటనతో యావత్ సినీపరిశ్రమ ఉలిక్కిపడింది. ఆ ఘటన తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది.
తెలుగులో ఒంటరి, హీరో, మహాత్మ, నిప్పు వంటి చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న భావన.. ఇప్పుడిప్పుడే తిరిగి రీఎంట్రీ ఇస్తుంది.
మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు తెలుగులోనూ అవకాశం వస్తే నటించేందుకు రెడీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.